Begin typing your search above and press return to search.

విడిపోయారు.. మళ్ళీ కలిశారా?

By:  Tupaki Desk   |   9 April 2018 10:18 AM GMT
విడిపోయారు.. మళ్ళీ కలిశారా?
X
బాలీవుడ్లో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. కాకపోతే ఒకసారి బ్రేక్ అప్ అయ్యాక మాత్రం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడానికి ఇబ్బంది పడతారు. చాలా వరకు కలిసి సినిమాలు చేయకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. విడిపోయాక కూడా కలిసి నటించి, ఫ్రెండ్లీ గా మెలుగుతున్న హీరో హీరోయిన్లు ఒకరకంగా తక్కువే. అందులోనూ సల్మాన్ కత్రినా వైఖరి అసలు అర్థంకాకుండా ఉంది.

కృష్ణ జింకను వేటాడిన కారణంగా సల్మాన్ ఖాన్ కు కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫాన్స్, మిగతా ఫామిలీ అంటే ఈ విషయం ఎక్కువ కత్రినా ను కలచివేసినట్టు తెలుస్తుంది. సల్లు ఎలాగైనా బయటకి రావాలి అని ప్రత్యేక పూజలు చేయించడం గమనార్హం. దాదాపు 48 జైలు గోడలు మధ్య గడిపిన ఈ 'వాంటెడ్' హీరో ఎట్టకేలకు జోధ్ పూర్ జైలు నుండి బెయిల్ మీద బయటకి వచ్చాడు. ఇక కత్రినా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే సల్మాన్ ఇంటికి బయలుదేరింది. అప్పుడు లోపలికి వెళ్లిన ఈ 'మల్లీశ్వరి' బ్యూటీ మళ్ళీ ఇంతవరకు బయటకి రాలేదు. సల్మాన్ తోనే వాళ్ళింట్లోనే ఉంటోంది.

సల్మాన్ ను పరామర్శించడానికి బాలీవుడ్ నుండి పలు సెలెబ్రెటీలు కూడా సల్లు ఇంటికి వెళ్లారు. అందులో వరుణ్ ధావన్ - జాక్వెలిన్ - కరణ్ జోహార్ - ప్రీతి జింటా - బాబీ డియోల్ - సానియా మీర్జా - ప్రభుదేవా కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకున్న సల్మాన్ - కత్రినాలు ఎప్పుడో విడిపోయారు. తరువాత కూడా కలిసి ఈమధ్యనే టైగర్ జిందా హై సినిమాలో మెరిసారు. మరి కత్రినా వెళ్లి సల్మాన్ ఇంట్లోనే ఉండిపోవడం వారి మధ్య ప్రేమ మళ్ళీ చిగురించింది అనడానికి సంకేతమా?