Begin typing your search above and press return to search.
నేనా.. లిప్ లాకా అంటున్న కత్రిన
By: Tupaki Desk | 5 Jan 2016 1:30 PM GMTప్రమోషన్ కోసమో, లేక పర్సనల్ విషయాల కోసమో కానీ.. ఇట్టే మాట మార్చేస్తుంటారు సినిమా జనాలు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ - కత్రినా కైఫ్ లు జంటగా నటించిన ఫిటూర్ మూవీకి ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఓ లిప్ లాక్ సీన్ కి సంబంధించిన అప్ డేట్స్ పై.. డైరెక్టర్ అభిషేక్ కపూర్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. రీసెంట్ గా బోలెడు నిబంధనలతో కూడిన చిట్టాను కూడా రిలీజ్ చేయడం విశేషం.
మరి ఫిటూర్ లో లిప్ లాక్ సన్నివేశానికి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారా.. అని డైరెక్టర్ ని అడిగారు మీడియా జనాలు. దీనికి అభిషేక్ నుంచి ఏ ఆన్సర్ వచ్చేదో కానీ.. ఇంతలోనే మధ్యలో కల్పించుకున్న కత్రిన.. ' అలాంటి సీన్ ఉందని ఎవరు చెప్పారు.. అలాంటివేమీ మేం చేయలేదు, ఈ సినిమాలో లేవు" అంటూ అనౌన్స్ చేసేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడున్నవాళ్ల వంతయింది. ఎందుకంటే.. గతేడాది కశ్మీర్ లో ఫిటూర్ టీం షూట్ చేస్తున్నపుడు.. ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ గాట్టిగా ముద్దుగా పెట్టుకుంటున్న ఫోటో ఒకటి లీక్ అయింది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. మరిప్పుడేమో అసలు అలాంటి సీన్స్ ఏవీ లేవంటోంది కత్రినా.
అయితే.. డైరెక్టర్ మాత్రం చాలా తెలివిగా స్పందించాడు. తమ మూవీలో సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యేలా ఎలాంటి సీన్స్ లేవని హుందాగా సమాధానమిచ్చాడు. ఇది ఓ రకంగా ప్రమోషన్ కోసం ఉపయోగపడుతుందని కొందరు అంటే.. అబ్బే అదేం లేదు.. పక్కన రణ్ బీర్ కపూర్ ఉన్నాడు కదా.. అందుకే ఇలా మాట మార్చింది అని మరికొందరు చెబ్తున్నారు. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే.. ఫిటూర్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.