Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కత్రిన కవ్వింత
By: Tupaki Desk | 5 Dec 2018 4:55 AM GMTకొత్తొక వింత.. పాతొక రోత! అన్నారు. కొత్తగా కనిపిస్తేనే కిక్కు. రొటీన్ గా కనిపిస్తే ఏం ఉంటుంది కిక్కు? ట‌్రెండ్ సెట్ చేస్తేనే ఏదై నా.. ఈ పద్ధతిని తొలి నుంచి అనుసరిస్తూనే ఉంది బాలీవుడ్ హాట్ గాళ్ కత్రిన కైఫ్. క్యాట్ లేటెస్ట్ ఫోటోషూట్ మరోసారి ఆ సంగతినే చెబుతోంది.
మునుపటితో పోలిస్తే కత్రిన లుక్ పూర్తిగా మారిపోయింది. ఏజ్ 34 ప్లస్ అన్న సంగతిని ఏమాత్రం బయటకు తెలియనీకుండా మ్యానేజ్ చేసేస్తోంది ఈ రూపంతో. ఇంకా టీనేజ్ నుంచి దూరం కాలేదేమో అన్నట్టుగా మారిపోయింది. ప్రఖ్యాత వోగ్ కవర్ పేజీకి కత్రిన ఇచ్చిన ఫోజులు యువతరంలో వేడి పెంచుతున్నాయి. ఏ డిజైనర్ మూసలో ఒలికిస్తే ఆ మూసకు ఇమిడిపోయే రూపం తన సొంతం అని ప్రూవ్ చేస్తోంది కత్రిన. రకరకాల డిజైనర్ డ్రెస్‌లలో ఒదిగిపోయి కనిపించింది. ముఖ్యంగా ఆ అందమైన రింగుల కురులను స్వేచ్ఛగా ఆరబోసి కొత్తగా తనని ఆవిష్కరించారు ఫోటోగ్రాఫర్.
ఓ ఇంటర్వ్యూలో కత్రిన గతం గురించి ప్రస్థావించడం ఈ సందర్భంగా హాట్ టాపిక్ అయ్యింది. రణబీర్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి క్యాట్ మరోసారి ఓపెన్ అయ్యింది. రణబీర్ నుంచి విడిపోయి విజయవంతంగా రెండేళ్లయ్యింది. ఇది తన మంచికే జరిగిందని, తనని తాను తరచి చూసుకునేందుకు వీలు చిక్కిందని పేర్కొంది. నా స్థాయి.. నా సత్తా ఎంతో తనకు అర్థమైందని కత్రిన వ్యాఖ్యానించడం విశేషం. రణబీర్ నుంచి విడిపోవడాన్ని రిగ్రెట్‌గా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని తెలిపింది. గతాన్ని విశ్లేషించుకునేందుకు ... `రా`గా ఉన్న తనలో మార్పులకు ఈ గ్యాప్ సాయపడిందని కత్రిన వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన `భరత్` చిత్రంలో నటిస్తోంది. రణబీర్ నుంచి విడిపోయాక మాజీ ప్రియుడు సల్మాన్‌తో వరుసగా సినిమాలకు కమిటవ్వడం ఈ సందర్భంగా యూత్‌లో చర్చకొచ్చింది. టైగర్ జిందా హై లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంటనే `భరత్` చిత్రానికి సంతకం చేసింది. విధి కలిపిన విచిత్ర బంధంలా.. ఈ మాజీల్ని ఫేట్ అలా దగ్గర చేసిందన్నమాట!!