Begin typing your search above and press return to search.

పెళ్లి కూతురు ఇలా పేకాడేస్తోందేమిటి

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:41 AM GMT
పెళ్లి కూతురు ఇలా పేకాడేస్తోందేమిటి
X
పెళ్లి దుస్తుల్లో కుంద‌న‌పు బొమ్మ‌లా ఉన్న ఈ అమ్మ‌డిని చూశారా? బంగారు బొమ్మ‌లా త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది క‌దూ?.. అంతా బాగానే ఉంది కానీ.. ఆ వేషాలేమిటి? ఇలా పేకాట‌లేమిటి? అంటారా .. అదంతే .. దీనినే మోడ్ర‌న్ యాటిట్యూడ్ అంటారు. ఇలాంటివి పాశ్చాత్య సంస్కృతి లోనే కాదు.. ఇప్పుడు భార‌త‌దేశ సంస్కృతిలోనూ భాగం అయిపోయాయి. న‌వ‌త‌రం యువ‌తుల హాస్ట‌ల్ క‌ల్చ‌ర్ విస్త్ర‌త‌మైన ఈ రోజుల్లో ఇలాంటివి చాలా కామ‌న్ అని ఫీల‌వ్వాలి.

అయితే వ‌ధువు గెట‌ప్ లో ఉన్నంత మాత్రాన ఇదేమీ నిజ‌మైన పెళ్లి కాదు లెండి. ఆన్ లొకేష‌న్ పెళ్లి. అందుకే ఇలా తాపీగా లొకేష‌న్ లో ముక్క‌లాట మొద‌లెట్టేశారు. రాజు .. రాణి.. ఆసు.. కింగ్ అంటూ ఒక‌టే ముక్క‌లు విసిరేస్తున్నారు. అలా అప్పుడ‌ప్పుడు చేయ‌క‌ పోతే బ్రెయిన్ కి రిలీఫ్ ఏం ఉంటుంది? రొటీనిటీతో బోర్ కొట్టేస్తుంది. క‌త్రిన - రోహిత్ శెట్టి అండ్ టీమ్ ఆన్ లొకేష‌న్ ఎంతో ప్లాన్డ్ గా మంచి ఏర్పాట్లే చేసుకున్నారు. ఈ సంక్రాంతి పండ‌క్కి ఊళ్ల‌కు త‌ర‌లొచ్చిన జ‌నం కూడా ఇలానే పేకాడుకున్నారు. గోదారి జిల్లాల్లో అయితే కోడిపందేలు ఒక‌వైపు .. పేక‌ట‌లు ఇంకోవైపు ర‌స‌ర‌మ‌స్యంగా సాగాయి. క‌త్రిన ఓసారి వాటిని గుర్తు చేసింది. అయినా విదేశీ మూలాలున్న భార‌తీయురాలు కాబ‌ట్టి క‌త్రిన‌కు ఇవ‌న్నీ రొటీనే.

సూర్యవంశీ సెట్ నుంచి క‌త్రిన -రోహిత్ శెట్టి -అక్షయ్ కుమార్ త‌దితరుల ఫోటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అక్షయ్ - కత్రిన జంట తెరవెనుక రొమాన్స్ కి సంబంధించిన‌ ఫోటో ఇటీవ‌లే వైరల్ అయ్యింది. ఆ ఇద్దరూ బీచ్ లో షికారు చేస్తున్న ఫోటో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. తాజాగా క‌త్రిన త‌న ప‌ర్స‌న‌ల్ టీమ్ తో ఇలా పేకాట‌లు ఆడుతోంది. ఒక బ్యూటిఫుల్ హాఫ్ వైట్ లెహంగా ధరించి న‌వ‌ వధువును త‌ల‌పిస్తున్న క‌త్రిన భారీ ఆభరణాలు ధ‌రించింది. వ‌ధువు గెట‌ప్ లో మెహెందీ హైలైట్ గా క‌నిపిస్తోంది. షాట్ గ్యాప్ లో ఇలా త‌న‌ బృందం తో కలిసి పేకాట ఆడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.