Begin typing your search above and press return to search.

ఆలియా సోద‌రి పుస్త‌కం పై క‌త్రిన సందేశం

By:  Tupaki Desk   |   4 Dec 2019 8:44 AM GMT
ఆలియా సోద‌రి పుస్త‌కం పై క‌త్రిన సందేశం
X
బాలీవుడ్ అందాల క‌థానాయిక క‌త్రిన కైఫ్.. కుర్ర బ్యూటీ ఆలియా భ‌ట్ స్నేహం గురించి తెలిసిందే. భ‌ట్స్ క్యాంప్ తో క‌త్రిన అనుబంధం నేప‌థ్యంలో ఆలియాకు తొలి నుంచి క‌త్రిన గైడెన్స్ ఉంది. ఇక ఇప్ప‌టికే ఆలియా ఇండియా బెస్ట్ స్టార్ గా అవ‌త‌రించింది. ప్ర‌స్తుతం ప‌లు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక క‌త్రిన స్నేహం కేవ‌లం ఆలియాతోనేనా? అంటే .. కానే కాదు. త‌న సోద‌రి షాహిన్ భ‌ట్ తోనూ అంతే స‌న్నిహితంగా ఉంటుంది.

నిన్న‌టిరోజున షాహిన్ త‌న చిన్న త‌నంలో అనుభ‌వించిన ఒత్తిడి (డిప్రెష‌న్) పైనా.. ఆత్మ‌ హ‌త్యాయ‌త్నంపైనా `ఐ హ్యావ్ నెవ్వ‌ర్ బీన్ అన్ హ్యాపియ‌ర్` పుస్త‌కాన్ని సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పుస్త‌కానికి ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు కురిశాయి. ఆ పుస్త‌కం చ‌దివిన క‌త్రిన‌ ప్ర‌శంస‌లు కురిపించింది. ఇందులో హృద‌యాన్ని హ‌త్తుకునే ఎన్నో విష‌యాలున్నాయి. అంత ఒత్తిడి లోనూ త‌న‌ని తాను నిభాయించుకుని ఆత్మ‌హ‌త్యా య‌త్నం విర‌మించుకోవ‌డం ఎంతో స్ఫూర్తి నింపింద‌ని ప్ర‌శంస‌లు కురిపించింది. ఇక షాహిన్ అలాంటి ప‌రిస్థితిలో ఉన్న‌ప్పుడు తాను ఏవిధంగానూ సాయ‌ప‌డ‌లేక‌పోయాన‌ని ఆలియా ఎమోష‌న్ అవుతూ పుస్త‌కావిష్క‌ర‌ణ వేదిక‌ పైనే ఏడ్చేసిన సంగ‌తి తెలిసిందే.

షాహీన్ భట్ ర‌చ‌న పుస్తక కాపీలను అర్జున్ కపూర్- కత్రినా కైఫ్ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. హృదయాన్ని క‌దిలించే ఎన్నో విష‌యాల్ని షాహీన్ నిజాయితీగా రాసినందుకు క‌పూర్ బోయ్ ప్రశంసించాడు. షాహిన్ ఆలోచ‌న‌ స్ఫూర్తిని ర‌గిలించింద‌ని.. బాధాకరమైన పరిస్థితిని సానుకూలంగా మార్చగలిగిన ధీర అని పొగిడేశారు. ఇక కెరీర్ ప‌రంగా చూస్తే.. కత్రిన త‌దుప‌రి రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రంలో న‌టిస్తోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో హీరో. ఆలియా ఒకేసారి మూడు చిత్రాల‌కు క‌మిటైంది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర స‌హా సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి చిత్రాల్లో ఆలియా న‌టిస్తోంది. టాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలోనూ ఆలియా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.