Begin typing your search above and press return to search.
ప్రేమ ప్రేమే.. సినిమా సినిమాయే
By: Tupaki Desk | 15 Jun 2017 2:25 PM GMTఎక్కడైనా సినిమా ఎలా ఉంటుందని ఎదురుచూడడం జరుగుతుంది కానీ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ ఎలా జరగబోతుందో అని ఎదురుచూస్తున్నారు జనాలు. బాలీవుడ్ అభిమానులు అంతా రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ జంటగా నటించిన జగ్గా జాసూస్ ఎప్పుడు ఎప్పుడు ప్రమోషన్లు మెదలుపెడుతుందా అనే చూస్తున్నారు. ఎందుకంటే ఈ కపుల్ ప్రేమకు చరమ గీతం పాడిన తరువాత వస్తున్న మొదటి సినిమా కాబట్టే.
అప్పట్లో రణబీర్-కత్రినా ఇద్దరం కలిసి ప్రమోషన్ చెయ్యం అంటూ మొండికేసి కూర్చున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. అనురాగ్ బసు చర్చలు ఫలించి సినిమా కోసం వీళ్ళు కలిసిపోయి అందంగా అందరితో కలిసి ఒక్కటిగా ప్రచారం చేస్తున్నారు. ‘గల్తీ సే మిస్టేక్’ పాట విడుదల కోసం అనురాగ్ బసు సాక్షిగా రణబీర్ కత్రినా కలిసి వచ్చి ఒకే వేదికపై హంగామా చేశారు. ఇప్పుడు వీళ్ళు మరింత స్నేహంగా మెలిగి ఒకే కారులో వచ్చి అందరినీ షాక్ కు గురి చేశారు. ఒక రేడియో స్టేషన్ ఇంటర్వ్యూ కోసం వీళ్ళు కలిసి వచ్చింది కాక ఫోటోగ్రాఫర్లు ముందు నవ్వులు చిందిస్తూ దాపరికం లేని స్నేహం మాది అన్నంతగా కలిసి పోజ్లు ఇచ్చారు.
మొన్ననే పాట విడుదల సంధార్బంగా రణబీర్ కత్రినాను తెగ పొగిడిన సంగతి మనకు తెలుసు, అలానే కత్రినా కూడా మాట్లాడుతూ.. “జగ్గా జాసూస్ సినిమా గురించి, మా గురించి మీరు వింటున్న చాలా విషయాలు అవాస్తవాలు. సినిమాకు ఏది మంచిదో అది నేను చేస్తాను. ఈ సినిమా కోసం నేను, రణబీర్ చాలా కష్టపడ్డాం” అని అందరి ప్రశ్నలకు ఒకే సమాధానం ఇచ్చింది. మొత్తానికి పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అని ఊరికే అన్నారా ఏంటి. ప్రేమ ప్రేమే.. సినిమా సినిమాయే అనుకోవాలి మనం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/