Begin typing your search above and press return to search.

కామోద్రేకం కొంప ముంచింది బాబోయ్‌

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:30 AM GMT
కామోద్రేకం కొంప ముంచింది బాబోయ్‌
X
బాలీవుడ్‌ లో తిరుగే లేని క‌థానాయిక‌గా క‌త్రిన కెరీర్‌ ని సాగిస్తోంది. ఓ వైపు ర‌ణ‌బీర్‌ తో ప్రేమాయ‌ణం సాగిస్తూనే, మ‌రోవైపు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ద‌శాబ్ధం పైగా సాగించిన కెరీర్‌ లో ఈ అమ్మ‌డికి ఢోఖానే లేకుండా పోయింది. ఇప్ప‌టికీ క‌త్రిన బాలీవుడ్‌ లో హాట్ ప్రాప‌ర్టీ. ఈ అమ్మ‌డు న‌టిస్తే చాలు చ‌క్క‌ని హిట్టొస్తుంది అన్న సెంటిమెంట్ ఉంది. అందుకే ఇప్పుడు అభిషేక్ క‌పూర్ క్యాట్ హీరోయిన్‌ గా ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. చార్లెస్ డికెన్స్ న‌వ‌ల - ది గ్రేట్ ఎక్స్‌ పెక్టేష‌న్స్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి ఫితూర్ అనే టైటిల్‌ ని నిర్ణ‌యించారు.

ఫితూర్ అంటే కామోద్రేకం అనే అర్థం వ‌స్తుంది. అయితే ఈ మూవీ షూటింగులో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆరంభం నుంచి ర‌క‌ర‌కాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. తొలుత ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌ లో రేఖ న‌టిస్తుంద‌ని ప్ర‌క‌టించినా చివ‌రి నిమిషంలో రేఖ హ్యాండిచ్చింది. ఆ త‌ర్వాత ఆ పాత్ర కోసం ట‌బుని సంప్ర‌దించారు. అలాగే హీరో - హీరోయిన్ ఎంపిక విష‌యంలోనూ బోలెడంత గ‌లాటా సాగింది. ఇందులో క‌త్రిన కైఫ్ స‌ర‌స‌న న‌టించే హీరో కోసం ఎంతో వెతికాడు ద‌ర్శ‌కుడు. చివ‌రికి ఆషికి 2 ఫేం ఆదిత్యరాయ్ క‌పూర్‌ ని ఎంపిక చేసుకున్నాడు. క‌థాంశం ప్ర‌కారం.. టైటిల్‌ లో ఇంటెన్సిటీ ప్ర‌కారం ఈ మూవీలో శృంగార స‌న్నివేశాల‌కు కొద‌వేం లేదు. లెక్క‌కు మిక్కిలి ఘాడ‌మైన రొమాన్స్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆల్ మోస్ట్ సినిమా మొత్తం తెర‌కెక్కించేశాడు. అయితే ఈ మూవీలో రొమాన్స్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా స‌రిగా తెర‌కెక్క‌లేద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నారుట‌. అందుకే తిరిగి వాటిని రీషూట్ చేయాల‌నుకుంటున్నాడు.

ఇదే విష‌యాన్ని క‌త్రిన‌తో చెబితే స‌సేమిరా అంద‌ని స‌మాచారం. అయినా ర‌ణ‌బీర్‌ తో అయితే అంత ఇన్వాల్వ్ అయ్యి చేసేసేదే. మ‌రి వేరొక హీరోతో కాస్త క‌ష్ట‌మే క‌దా! అందుకే క‌త్రిన ఇలా మొండికేస్తోంద‌ని అంటున్నారు. పైగా కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌లేక క‌త్రిన ద‌ర్శ‌కుడితో కొట్లాట పెట్టుకుంద‌ని చెబుతున్నారు. ఈ ఫిబ్ర‌వ‌రిలో సినిమాని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. కుదురుతుందో లేదో?