Begin typing your search above and press return to search.

రణబీర్ సీక్రెట్ చెప్పేసిన కత్రీనా

By:  Tupaki Desk   |   7 May 2019 4:30 PM GMT
రణబీర్ సీక్రెట్ చెప్పేసిన కత్రీనా
X
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి తెలిసిందే. కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో లేట్ గా జాయిన్ అయింది. ఏప్రిల్ 2017 లో జాయిన్ అయింది. అయితే ఈ రెండేళ్ళలోనే 21.5 మిలియన్ ఫాలోయర్స్ ను సాధించిందంటే కత్రినా క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కత్రీనా రీసెంట్ గా అర్బాజ్ ఖాన్ నిర్వహించే చాట్ షో 'పించ్' కు గెస్ట్ గా హాజరయింది. ఈ సందర్భంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ గురించి ఒక సీక్రెట్ చెప్పేసింది.

అర్బాజ్ ఖాన్ "కత్రినా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఉందా? వేరే వాళ్ళను సీక్రెట్ గా ఫాలో అయ్యేందుకు.. కామెంట్స్ చేసేందుకు?" అని అడిగాడు. దీనికి సమాధానంగా "లేదు లేదు.. కానీ రణబీర్ కు ఉంది. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ ఎలా పని చేస్తుందో నాకు చూపించిందే రణబీర్" అని చెప్పింది. అయినా అర్బాజ్ రణబీర్ సంగతి అడగకుండానే అతనికి సంబంధించిన సీక్రెట్ ను బైట పెట్టేసింది. అసలే రణబీర్ కు కాసనోవా అని పేరుంది. ఈ ఇన్స్టాగ్రాములు.. కేజీలు ఒక లెక్కా. వాడకం పూర్తిగా తెలిసిన ఈ జెనరేషన్ కపూర్ ఆయిన. మరి కత్రీనా బైటపెట్టిన విషయం గురించి రణబీర్ ఎలా స్పందిస్తాడో.. ముఖ్యంగా రణబీర్ ప్రెజెంట్ లవర్ అలియా భట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కత్రినా సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తో నటించిన 'భారత్' జూన్ లో ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్షయ్ కుమార్ తో 'సుర్యవంశీ' చిత్రంలో కూడా కత్రినా హీరోయిన్ గా నటిస్తోంది. పీటీ ఉష బయోపిక్ లోనూ.. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కే 'ది ఎండ్ అఫ్ టైగర్' లో కూడా కత్రినా నటిస్తోంది.