Begin typing your search above and press return to search.
హుక్కా తాగుతున్న బంధిపోటు!
By: Tupaki Desk | 13 Sep 2018 11:11 AM GMTబయోపిక్ - హిస్టారికల్ కథల వెల్లువలో అన్నిచోట్లా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. హిస్టారికల్ కథల్ని తవ్వి తీస్తున్నారు. అలాంటి తవ్వకాల్లోంచి స్ఫూర్తి పొందిన సినిమానే `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`. అప్పట్లో బంధిపోటు దొంగల అరాచకాలు ఎలా ఉండేవో ఈ సినిమాలో చూపించేందుకు అమీర్ ఖాన్ & టీమ్ సంకల్పించారు. `ధూమ్ 3` ఫేం విజయ్ కృష్ణ ఆచార్య లాంటి క్రియేటివ్ ట్యాలెంట్ ఈ సినిమా తీస్తున్నారు అనగానే ఒకటే ఉత్కంఠ నెలకొంది. అమీర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ - ఫాతిమ సనా షేక్ - కత్రిన లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీగా దీని గురించి చర్చించుకుంటున్నారు.
అందుకే థగ్స్ కి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా వెంటనే జనం క్యాచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లొకేషన్ నుంచి బోలెడన్ని పోటోలు సామాజిక మాధ్యమాల ద్వారా లీకైపోయాయి. కొన్నిటిని కత్రిన స్వయంగా లీక్ చేయడం ఇటీవల చర్చకొచ్చింది. మొత్తానికి థగ్స్ పై ఆసక్తిని జరరేట్ చేయడానికి ఈ లీకేజీలు సహకరించాయి. అమీర్ - అమితాబ్ భీకరమైన గెటప్పులు ..జులపాల జుత్తు.. విచిత్ర వేషధారణలతో కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.
అసలు ఈ చిత్రంలో థగ్స్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తారా? అంటూ మరో ఫోటోని కత్రిన కైఫ్ నేడు వినాయక చవితి కానుకగా రివీల్ చేసింది. ఈ కొత్త ఫోటోలో అమీర్ ఖాన్ థగ్ గెటప్ లో హుక్కా పీల్చుతూ కనిపించాడు. నోట్లో పైప్ పెట్టుకుని చిద్విలాసంగా పొగ లాగేస్తూ కనిపించాడు. ఈ లుక్ ప్రామిస్సింగ్గా ఉంది. రాజస్థాన్ ఎడారిలో - థాయ్ ల్యాండ్ రెయిన్ ఫారెస్ట్ లో ఒళ్లు గగుర్పొడిచే లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వయసుల వారికి నచ్చే విజువల్ వండర్ ఈ సినిమా అని కాన్ఫిడెంట్ గా చెబుతోంది టీమ్. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయనున్నారు. ఇండియాలో 2.ఓ తర్వాత మళ్లీ అంతగా చెప్పుకునే సినిమా ఇదే అవుతుందని, అంత లావిష్ బడ్జెట్తో రాజీకి రాకుండా తెరకెక్కిస్తున్నారని మరోవైపు ప్రచారం సాగుతోంది.