Begin typing your search above and press return to search.

ఫోటో పాతదే.. షోకులే కొత్తగా!!

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:45 AM GMT
ఫోటో పాతదే.. షోకులే కొత్తగా!!
X
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోతూ ఉంటుంది. రణబీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత ఈ భామకు కెరీర్ పరంగా పెద్దగా కలిసి రావడం లేదు కానీ.. అమ్మడి స్పీడ్ మాత్రం ఏమీ తగ్గడం లేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టుల కౌంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఫేస్ కాసింత డౌన్ కావడంతో ఫోటో షూట్స్.. కవర్ పేజ్ లు లాంటివి మాత్రం కాస్త తగ్గాయనే చెప్పాలి.

అందుకే అనుకుంటా.. థ్రోబ్యాక్ అంటూ పాత సంగతులను బయటకు తీస్తోంది కత్రినా. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇలాంటిదే ఓ పాత ఫోటోను షేర్ చేసింది కేట్. ఉల్లిపొర మాదిరిగా ఉండీ లేనట్లుగా ఉన్న డ్రెసింగ్ లో అమ్మడు చెట్టు కింద నుంచి భలే పోజ్ ఇస్తోంది. అసలే వైట్ డ్రెస్.. పైగా మండుటెండ.. అందులోనూ సముద్ర తీరం.. అమ్మడు అందాలను తనివితీరా కనులవిందుగా చూసుకునేందుకు ఇంతకంటే సూపర్బ్ లొకేషన్.. సిట్యుయేషన్ ఇంకేం దొరుకుతుందో చెప్పండి. పైగా డ్రెసింగ్ విషయంలో కూడా కత్రినా తెగ పొదుపు పాటించేస్తూ ఉంటుంది.

కత్తి లాంటి అందాల ప్రదర్శన విషయంలో తన స్టైల్ కు కొత్తగా పదును పెట్టేస్తూ ఉంటుంది. ఇదో అందమైన రోజు అంటూ కేట్ గుర్తు చేసుకోవడం సంగతేమో కానీ.. ఆ పాత ఫోటోలో కనిపిస్తున్న కొత్త అందాలను తనివితీరా చూసుకునేందుకు మాత్రం ఫాలోయర్స్ కు సూపర్బ్ ఛాన్స్ లభించేసింది.