Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఫిలిం ఫేర్ పై కత్రినా మంటలు

By:  Tupaki Desk   |   29 May 2019 1:23 PM GMT
ఫోటో స్టొరీ: ఫిలిం ఫేర్ పై కత్రినా మంటలు
X
బాలీవుడ్ లో హీరోయిన్లు చాలామందే ఉంటారు. వారిలో ఐష్ లాంటి సీనియర్లు.. జాన్వి .. అనన్య లాంటి జూనియర్లు ఉంటారు. అయితే ఎంతమంది ఉన్నా కత్రినా కైఫ్ స్థానం మాత్రం ప్రత్యేకమైనదే. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భారత్' లో హీరోయిన్ గా నటిస్తోంది. మరో వారంలోపే ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. పనిలో పనిగా 'ఫిలిం ఫేర్' కవర్ పేజిపై హాటుగా మెరిసింది.

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ జూన్ 2019 ఎడిషన్ కవర్ పేజిపై మెరవడంతో పాటుగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టుంది. అందుకే "నేను ఇంకా సింగిల్- గట్టిగా జవాబిచ్చిన కత్రినా కైఫ్" అనే టైటిల్ కవర్ పేజిపై ఉంది. ఫోటోలో కత్రినా ఆకుపచ్చ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్టు ధరించి ఒక చెక్క స్టూల్ పై సెక్సీ పోజిస్తూ కూర్చుంది. ప్యాంట్ లేకపోవడంతో కత్రినా పొడవైన కాళ్ళ అందాలు మిలామిలా మెరుస్తూ బైటపడ్డాయి. ఒక చేతిని కాలి దగ్గర మరో చేతిని గడ్డం దగ్గర పెట్టుకొని మోడరన్ బాలీవుడ్ మోహినిలా కనిపిస్తోంది. జుట్టును చిందరవందరగా స్టైలింగ్ చేయడంతో సెక్సీనెస్ మరింతగా పెరిగింది.

ఈ ఫోటోకు ఇన్స్టా లో భారీ రెస్పాన్స్ వచ్చింది. గంటలోపే 1.77 లక్షల లైకులు వచ్చాయి. ఇక కామెంట్లు కూడా మహా హాటుగా ఉన్నాయి. "కేట్ ఈజ్ సింగిల్ రెడీ టు మింగిల్" అని ఒకరు అన్నారు. మరొకరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్నారు. ఇంకొకరు "నువ్వొక్కదానివే కాదు.. భాయిజాన్ కూడా సింగిలే" అన్నారు. ఒకరు "ఇక్కడ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు. ఇప్పుడు హాట్ ఫోటో.. అన్యాయం" అన్నారు.