Begin typing your search above and press return to search.
మెగాస్టార్ మూవీలో కత్రినా లుక్ ఇదే
By: Tupaki Desk | 4 July 2017 4:51 PM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఆమిర్ ఖాన్ తొలిసారిగా కలిసి నటిస్తున్న మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. వచ్చే ఏడాది రిలీజ్ లలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ఇది. చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో దంగల్ భామ ఫాతిమా సనా షేక్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీలో కత్రినా కైఫ్ లుక్ ను మూవీ యూనిట్ రివీల్ చేసేసింది. ఈ చిత్రంలో ఓ భారతీయ యువరాణి పాత్రలో కత్రినా కనిపించనుండగా.. యుద్ధాలు చేసే రాణిగా అలరించనుంది కేట్. ముక్కు పుడక పెట్టుకుని.. గాలికి ఎగురుతున్న జుట్టుతో.. కాసిన్ని ఆభరణాలు పెట్టుకుని.. మత్తెక్కించే కళ్లతో చూస్తున్న కత్రినా కైఫ్ ఫోటోను చూపించింది మూవీ యూనిట్. ఎర్త్ కలర్ లో ఉండే థీమ్ తో డిజైన్ చేసిన ఈ పిక్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. కత్రినా కైఫ్ గెటప్ ను గాగ్రా-చోళీ నుంచి ఇన్ స్పైర్ అయినట్లు చెప్పచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాల్టాలో జరుగుతోండగా.. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ యంగ్ లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే తన పాత్ర కోసం బోలెడంత బరువు తగ్గిపోయి స్లిమ్ లుక్ లోకి వచ్చేశాడు ఆమిర్. మరోవైపు అమితాబ్ చేయనున్న రోల్ సినిమాకి స్పెషల్ అస్సెట్ కానుంది. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీని వచ్చే ఏడాది దీపావళి నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్.