Begin typing your search above and press return to search.

వీడియో: సుర‌య నాట్యవిలాపం

By:  Tupaki Desk   |   28 Oct 2018 6:40 AM GMT
వీడియో: సుర‌య నాట్యవిలాపం
X
ధూమ్ 3`లో అమీర్‌ ఖాన్‌ తో జోడీగా క‌నిపించింది క‌త్రిన‌. అమీర్ స‌ర్క‌స్ టీమ్‌లో చేరే అమ్మాయిగా క‌త్రిన అథ్లెటిక్ ఫీట్స్ మైమ‌రిపించాయి. ఒళ్లంతా మెరుపుతీగ‌లా మార్చి క‌త్రిన చేసిన డ్యాన్సులు మ‌తి చెడ‌గొట్టాయి. ముఖ్యంగా ఒక స‌ర్క‌స్ క‌న్య‌క‌గా రింగ్ డ్యాన్స్ అద‌ర‌గొట్టేస్తుంది. ఇటీవ‌లే టైగ‌ర్ జిందా హై చిత్రంలో స‌ల్మాన్ కి ధీటుగా యాక్ష‌న్ క్వీన్‌ గా మైమ‌రిపించింది. పాకిస్తాన్ ఏజెంట్ పాత్ర‌లో క‌త్రిన పెర్ఫామెన్స్ కిరాక్ పుట్టించింది. ఆ రెండిటికంటే మ‌రింత బ్రిలియంట్ రోల్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`లో క‌త్రిన చేస్తోంది.

సుర‌య అనే డ్యాన్స‌ర్ పాత్ర‌లో క‌త్రిన అంద‌చందాల్ని - డ్యాన్సింగ్ విన్యాసాల్ని వీక్షించే భాగ్యం యూనివ‌ర్శ‌ల్ ఆడియెన్‌ కి క‌ల‌గ‌నుంది. సుర‌య పాత్ర‌ను ప్రాణం పెట్టి చేసింద‌న‌డానికి ఇదివ‌ర‌కూ రిలీజైన సాంగ్ మేకింగ్ వీడియో చూస్తే అర్థ‌మైంది. ఇప్పుడు అంత‌కుమించి క‌త్రిన ఈ సినిమాలో నృత్యాల కోసం ఎంత‌గా ప్రాక్టీస్ చేసిందో చూపించే వీడియో రివీలైంది.

ఈ వీడియోలో క్యాట్ రెగ్యుల‌ర్ డ్యాన్సింగ్ ప్రాక్టీస్ ఏ రేంజులో ఉంటుందో అర్థ‌మైంది. సుర‌య పాత్ర కోసం క‌త్రిన ఇంత‌గా శ్ర‌మించిందా? అన్న భావ‌న క‌లుగుతోంది. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌కి మ‌న జాక్స‌న్ ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ అందించారు. క‌త్రిన డ్యాన్స్ ప్రాక్టీస్ ఆద్యంతం ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సాగింద‌ని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. క‌మిట్‌ మెంట్ అంటే క‌త్రిన‌ - క‌త్రిన అంటే క‌మిట్‌ మెంట్! అన్న‌తీరుగా ఉందీ ప్రాక్టీస్. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతోంది. థియేట‌ర్ల‌లో నేరుగానే క‌త్రిన డ్యాన్సింగ్ విన్యాసాలు వీక్షించే ఛాన్స్ అంద‌రికీ ద‌క్క‌నుంది.