Begin typing your search above and press return to search.
మండుతున్న ఎండలో వేడి వేడిగా..
By: Tupaki Desk | 7 Aug 2017 11:28 AM GMTసాధారణంగా ఇప్పటి హీరోయిన్లు తెరపై ఎక్కువ కాలం మెరవలేరని అందరికి తెలిసిన విషయమే.. కానీ కొందరు హీరాయిన్లు సినిమా రంగంలోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు అవుతున్నా జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ.. నేటితరం హీరోయిన్లకు సవాలు విసురుతున్నారు. ముప్పై పదుల వయసుదాటిన ఇంకా ఇరవై ఏళ్ల అమ్మాయిల్లానే అందాన్ని మెయింటెయిన్ చేస్తున్నారు.
అలాంటి హీరోయిన్లలో ఒకరు కత్రినా కైఫ్.. తెలుగులో మల్లీశ్వరి సినిమాలో మహారాణిగా నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ త్రయంగా చెప్పుకునే.. అమిర్ - సల్మాన్ - షారుక్ లతో ఆడిపాడింది. మొన్నటి వరకు బాగానే ఉన్నా ఈ అమ్మడి ఫ్యూచర్ ఈ మధ్య కాస్త నెమ్మదించింది. ఊహించని ప్లాప్స్ తో సతమతమవుతుంది. అయినా గాని కత్రినాకి ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సల్మాన్ తో "టైగర్ జిందా హై" సినిమాలో నటొస్తోంది. అయితే రీసెంట్ గా జరిగిన ఈ షూటింగ్ లోని కొన్ని పోటోలను కత్రినా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. యాక్షన్స్ సీన్స్ కోసం సినిమా యూనిట్ 44 డిగ్రీల ఎర్రటి ఎండలో కత్రినా పై కొన్ని షాట్స్ ని తెరక్కించారట. దీంతో సెట్స్ లో దిగిన మూడు ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది.
ఇప్పుడు కత్రినా కైఫ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూస్తున్న అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ ఈ చిత్రం తో పాటు అమిర్ ఖాన్ - షారుక్ ఖాన్ లతో తెరకెక్కనున్న చిత్రాల్లోనూ నటిస్తోంది.