Begin typing your search above and press return to search.
ఏముంది రొటీనే కదా..
By: Tupaki Desk | 1 Nov 2017 5:13 PM GMTప్రస్తుత రోజుల్లో ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే చాలు ఆ నటులను ఆకాశానికి ఎత్తేస్తుంటారు పక్కన ఉన్న ప్రముఖులు. ఇక సీనియర్ నటులు కనిపిస్తే చాలు ఆకాశానికి ఎత్తేస్తారు. ఈ తరహా వ్యవహారం ప్రతి ఇండస్ట్రీలో కనిపిస్తున్నదే. హీరో - హీరోయిన్స్ ఫస్ట్ లుక్ మొదలుకొని సక్సెస్ మీటింగ్ ల వరకు పొగడ్తల సుప్రబాతాలను రెడీ చేసుకుంటారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఒక సినిమా కు సంబందించి ఫస్ట్ లుక్ రొటీన్ గానే ఉన్నా ఓవర్ గా పొగిడేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ జిందాహై అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. స్పై త్రిల్లర్ తరహాలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. అయితే ఆ సినిమాలో అమ్మడు పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ జోయా అనే రోల్ లో కనిపించనుంది. అయితే సినిమాలో అమ్మడి లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన చిత్ర దర్శకుడు అబ్బాస్ సినిమాలో తన నటనతో చంపేసింది చించేసింది అనే రేంజ్ లో కామెంట్ చేశాడు. అంతే కాకుండా ఫస్ట్ లుక్ లో కూడా చాలా బావుందని మొదటి సారి లుక్ ని తాను చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను అనే విధంగా చెబుతున్నాడు.
కానీ లుక్ ని చూస్తే అంతగా ఏమి అనిపించడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏముంది రొటీన్.. గన్ పట్టుకొని చూస్తోంది. రెగ్యులరే కదా. దానికి ఇంత బిల్డప్ ఎందుకని కూడా అంటున్నారు. మరి సినిమాలో అయినా అమ్మడి క్యారెక్టర్ విమర్శకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.