Begin typing your search above and press return to search.

కత్తి ఖాతాలో కొత్తగా ఓ అవార్డు

By:  Tupaki Desk   |   15 Sep 2016 1:30 PM GMT
కత్తి ఖాతాలో కొత్తగా ఓ అవార్డు
X
లవ్ స్టోరీ బ్రేకప్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కి టైమ్ అస్సలు బాగాలేదు. వరుసగా ఈమె నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తున్నాయి. అంతా బ్యాడ్ ఫేజ్ నడుస్తోందని అనుకునే టైమ్ లో.. అమ్మడికి రెండు గుడ్ న్యూస్ లు ఎదురొచ్చాయి. ఇప్పటికే ఏక్ థా టైగర్ సీక్వెల్.. టైగర్ జిందా హైలో.. కత్రినా లీడ్ హీరోయిన్ గా ఫైనల్ కాగా.. ఇప్పుడో ప్రతిష్టాత్మక అవార్డు అమ్మడి సొంతమైంది.

ప్రియదర్శని అకాడమీ గ్లోబల్ అవార్డ్ వారు అందించి స్మితా పాటిల్ స్మారక అవార్డును.. ఈ ఏడాది కత్రినా కైఫ్‌ కు అనౌన్స్ చేశారు. సోషియో-కల్చరల్.. ఎడ్యుకేషన్ కి సంబంధించిన కార్యకలు నిర్వహించే ఈ స్వచ్ఛంద సంస్థ.. సినీ రంగంలో అద్భుతమైన పని తీరు కనపరచిన వారికి 1984 నుంచి ఈ స్మితా పాటిల్ అవార్డును అందిస్తోంది. ఈ ఏడాది కత్రినా కైఫ్ కు ఈ అవార్డు దక్కగా.. ఈ నెల 19న ముంబైలో నిర్వహించనున్న ఫంక్షన్ లో దీనిని అందచేయనున్నారు.

మరోవైపు కత్తి నటించిన కొత్త సినిమా బార్ బార్ దేఖో.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. కాలా చెష్మా అంటూ బాగానే సందడి చేసినా.. అదంతా ట్రైలర్లు., ప్రోమోలకు తప్ప సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాంటి టైమ్ లో సల్మాన్ తో సినిమా.. స్మితా పాటిల్ అవార్డు దక్కడం.. కత్రినాకి కొత్త ఉత్సాహం తేవడం ఖాయం.