Begin typing your search above and press return to search.

పీటీ ఉష బ‌యోపిక్.. టైటిల్ రోల్ ఎవ‌రు!!

By:  Tupaki Desk   |   24 April 2019 9:04 AM GMT
పీటీ ఉష బ‌యోపిక్.. టైటిల్ రోల్ ఎవ‌రు!!
X
బ‌యోపిక్ ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. ప్ర‌ముఖ అథ్లెట్ పి.టి.ఉష జీవిత‌క‌థ‌తో బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు సీనియ‌ర్ న‌టి- ద‌ర్శ‌కురాలు రేవ‌తి సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. మేరీకోమ్ కంటే ముందే ఈ బ‌యోపిక్ క‌థ‌ను రెడీ చేసి ప్రియాంక చోప్రాని సంప్ర‌దించార‌ట‌. తొలుత బాక్స‌ర్ మేరీకోమ్ పాత్ర‌లో న‌టించిన ప్రియాంక చోప్రా త‌న ఆప్ష‌న్ అని రేవ‌తి ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. ఆ త‌ర్వాత పీసీ కోసం ఏళ్ల‌కు ఏళ్లుగా వేచి చూశారు. బ‌యోపిక్ స్క్రిప్టు రెడీ అయ్యాక త‌న‌తో ప‌లుమార్లు క‌థా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక సెట్స్ కి వెళ్ల‌డ‌మే అనుకున్న స‌మ‌యంలో పీసీ పూర్తిగా హాలీవుడ్ ఆఫ‌ర్ల‌తో విదేశీ షూటింగుల్లో బిజీ అయిపోయింది. ఆ క్ర‌మంలోనే త‌న‌కోసం రేవ‌తి ఇప్ప‌టివ‌ర‌కూ వేచి చూశార‌ని తెలుస్తోంది. పెళ్లి త‌ర్వాత ప్రియాంక చోప్రా నిరంత‌ర సెల‌బ్రేష‌న్స్ తో ముంబైలో అందుబాటులో లేని సంగ‌తి తెలిసిందే.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. పీసీ లాస్ .. క‌త్రిన గెయిన్! అని విన‌బ‌డుతోంది. ప్రియాంక చోప్రాను ప‌క్క‌న పెట్టి క‌త్రిన‌తో ఈ సినిమా చేసేందుకు రేవ‌తి సంప్ర‌దింపులు జ‌రిపార‌ని బాలీవుడ్ లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే రెండుసార్లు క‌త్రిన‌కు రేవ‌తి క‌థ‌ను నేరేట్ చేశారు. ఇటీవ‌లే బెంగ‌ళూరు నుంచి ముంబై వెళ్లి త‌న‌ను క‌లిసి ఫైన‌ల్ స్క్రిప్టు వినిపించార‌ట‌. స్క్రిప్టు బావుంది. ఇక సెట్స్ కెళ‌దామ‌ని కత్రిన గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అయితే పీటీ ఉష‌లా క‌త్రిన ఫిట్ గా ఉంటుందా? అనేదే సందేహం. అస‌లే ఏజ్డ్ హీరోయిన్... వ‌య‌సు 30 ప్ల‌స్ కాబ‌ట్టి త‌న‌కు వ‌య‌సు ఎంత‌వ‌ర‌కూ స‌హ‌క‌రిస్తుంది? అన్న‌ది అనుమాన‌మే. రన్నింగ్ ట్రాక్ పై రిగ‌ర‌స్ గా ప్రాక్టీస్ చేస్తేనే అథ్లెట్‌ పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేసే వీలుంటుంది. అథ్లెట్ లుక్ కి మారాలంటే బ‌బ్లీగా ఉండే ఈ బ్యూటీకి కాస్త‌ క‌ష్ట‌మేనేమో! అంటూ విశ్లేషిస్తున్నారు. పైగా న‌వ‌త‌రం నాయిక‌ల్లో నిరంత‌రం క‌స‌ర‌త్తుల‌తో అథ్లెటిక్ లుక్ లో క‌నిపిస్తున్న భామ‌లెంద‌రో ఉండ‌గా రేవ‌తి త‌న‌నే ఎందుకు సంప్ర‌దించారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

కేర‌ళ‌కు చెందిన అథ్లెట్ పీటీ ఉష ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌. పైగా అర్జున అవార్డులు అందుకున్నారు. కెరీర్ లో ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించిన గ్రేట్ అథ్లెట్ గా ప్ర‌పంచానికి సుపరిచితం. ఇక పీటీ ఉష ప్ర‌తిభ గురించి ఇండియాతో పాటు దేశ విదేశాల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చిస్తారు. చైనా స‌హా విదేశాల్లోనూ క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటారు.అక‌డ‌మిక్‌ పుస్త‌కాల్లోనూ పీటీ ఉష పాఠ్యాంశం ఉన్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ని చైనా, ర‌ష్యా స‌హా ఇత‌ర‌చోట్ల రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది కాబ‌ట్టి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ రేవ‌తి ప్ర‌య‌త్నంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఇప్ప‌టికే ఆస్కార్ గ్ర‌హీత .. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ ని సంగీత ద‌ర్శ‌కుడిగానూ ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది.