Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః కత్రిన కాదు, రేసుగుర్రం

By:  Tupaki Desk   |   2 Sep 2015 3:58 PM GMT
ఫోటో స్టోరిః కత్రిన కాదు, రేసుగుర్రం
X
సక్సెస్‌ ఇచ్చిన కిక్కులో ఉంది కత్రిన. ఈ భామ నటించిన ఫాంటమ్‌ బాలీవుడ్‌లో దుమ్ము దులిపేస్తోంది. పాకిస్తాన్‌ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకులకు నచ్చకపోయినా బాక్సాఫీస్‌ వసూళ్లలో అదరగొట్టేస్తోందని రిపోర్ట్‌ వచ్చింది. సరిగ్గా ఇదే హుషారులో కత్రిన కవర్‌ పేజీలపై తళతళలాడిపోతూ నవతరం నాయికలతో రేసులోంచి తప్పుకోలేదని సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ ఫోజు చూస్తుంటే.. ఇప్పుడొస్తున్న నాయికలతో పోల్చి చూస్తే వయోభేధం ఈ భామలో ఇసుమంత కూడా కనిపించడం లేదు. పైగా రేసుగుర్రంలా చాలా ఎనర్జిటిక్‌ గా కనిపిస్తోంది. ఇదిగో ఈ కొత్త ఫోటో షూట్‌ కోసం ఓ డిజైనర్‌ వేర్‌ ని స్పెషల్‌ గా డిజైన్‌ చేయించారు. ఈ ఔట్‌ ఫిట్‌ ని 'నికోలస్‌ కె' ఔట్‌ ఫిట్‌ అని పిలుస్తున్నారు. అనైతా ష్రాఫ్‌ అడజానియా .. డిజైనర్‌ గా పనిచేశారు.

ఈ లుక్‌ లో క్యాట్‌ వండర్‌ఫుల్‌. లూజ్‌ కట్‌ తో ఫ్రీ గా వదిలేసిన కురులు .. నెక్‌ మోడల్‌ టాప్‌ డిజైన్‌, నల్ల రంగులో అదిరిపోయింది. కాంబినేషన్‌గా కాసులు అతికిన గొలుసు వేసుకుని దిమ్మదిరిగే రేంజిలో కనిపిస్తోంది. ఇలాంటివి హాలీవుడ్‌లో మాత్రమే చూడగలం. మళ్లీ క్యాట్‌ వల్ల ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రఖ్యాత మ్యాగజైన్‌ వోగ్‌ సెప్టెంబర్‌ కవర్‌ పేజీపై దర్శనమిచ్చిందిలా. కత్రిన కాదు రేసుగుర్రం అనిపించడం లేదూ?