Begin typing your search above and press return to search.

అంబానీ కొడుకుతో ఆ హీరోయిన్??

By:  Tupaki Desk   |   10 Nov 2016 1:34 AM GMT
అంబానీ కొడుకుతో ఆ హీరోయిన్??
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బ్రేకప్ గొడవ సద్దుమణిగిపోయింది. రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి.. కపూర్ ఫ్యామిలీ ఈవెంట్స్ లో పాల్గొనేంత వరకు వెళ్లిన తర్వాత.. సడెన్ గా ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. కొన్నాళ్లపాటు రిటార్టులు ఇచ్చుకుంటున్నట్లు కనిపించినా.. ఇప్పుడు వేరేవారి విషయాల్లో తలదూర్చడం మానేశారనే చెప్పాలి.

ఇలాంటి పరిస్థితుల్లో కత్రినా కైఫ్ కొత్త తోడును వెతుక్కుందనే టాక్ వినిపిస్తోంది. అతనెవరో కాదు.. దేశీయ అతి పెద్ద కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ. ఈ కుర్రాడితో కేట్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేస్తోందట. అట ఏంటీ.. మొన్నా మధ్య అమితాబ్ బచ్చన్ దివాలి బాష్ కి.. ఇద్దరూ కలిసి ఒకే కార్ లో జంటగా వచ్చేశారు. ఇక్కడే ఈ జంట వ్యవహారం పదిమందికీ తెలిసింది.

బిగ్ బీ ఇచ్చిన దివాలి బాష్ లో రణబీర్ కూడా ఉన్నాడు కానీ.. కేట్ అటు వైపు తొంగి కూడా చూడలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. కత్రినా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు కాగా.. ఆకాష్ అంబానీ వయసు 25 ఏళ్లు మాత్రమే. అయినా కూడా కలిసి ఒకే కార్ లో పార్టీ కి వెళ్లినంత మాత్రాన ఎఫైర్ ఉన్నట్టు కాదు కానీ ఈ పిక్స్ చూసాక బాలీవుడ్ మీడియా ఆగడం లేదు