Begin typing your search above and press return to search.

ఒక్క సెక‌నులో కొప్పు ముడి.. చాలా వీజీ అంటున్న క‌త్రినా!

By:  Tupaki Desk   |   1 Feb 2021 11:11 AM GMT
ఒక్క సెక‌నులో కొప్పు ముడి.. చాలా వీజీ అంటున్న క‌త్రినా!
X
ఆడ‌వాళ్లు జుట్టు దువ్వుకోవ‌డానికి ఎంత టైం తీసుకుంటారో అంద‌రికీ తెలిసిందే. ర‌క‌ర‌కాల హెయిర్ స్టైల్స్ తో ఒక ప‌ట్టాన కంప్లీట్ చేయ‌రు. కానీ.. ఒక్క సెక‌నులో కొప్పు ముడేస్తానంటోంది క‌త్రినా! చెప్ప‌డ‌మే కాదు.. చేసి చూపిస్తోంది. సాక్ష్యంగా ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అగ్ర‌ప‌థానికి దూసుకెళ్లిన కత్రినా కైఫ్.. ఫ్యాన్స్ ను థియేటర్లో క‌నువిందు చేసి చాలా కాల‌మ‌వుతోంది. సల్మాన్‌ఖాన్‌తో ఈమె న‌టించిన ‘భారత్’ సినిమా ఆఖరిది. ఆ త‌ర్వాత న‌టించిన ‘సూర్య‌వంశీ’ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా.. ఇంకా రిలీజ్ కాలేదు. ప్ర‌స్తుతం ‘భూత్ పోలీస్’ షూటింగ్ లో బిజీగా ఉంది కత్రినా.

అయితే.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ కు మాత్రం నిత్యం అందుబాటులోనే ఉంటోంది. జిమ్ లో కష్టపడుతున్న వీడియోలతోపాటు బ్యూటీ పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అయితే.. రీసెంట్‌గా ఓ ఫ‌న్నీ వీడియో పోస్ట్ చేసింది కత్రినా.

ఈ వీడియోలో పొడ‌వాటి జుట్టుని ఒక్క సెకనులోనే ఎలా ముడివేసుకోవచ్చో చూపించింది. తన జుట్టు మీద చేసి చూపించిన ఈ హెయిర్ ట్రిక్ అందరికీ తెగ నచ్చడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా క‌త్రినా టెక్నిక్ కు ఫిదా అవుతున్నారు. ‘వాట్ ఏ ఆన్ ఐడియా బ్యూటీ’ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా ఓ లుక్కేయండి.