Begin typing your search above and press return to search.

కత్రినా పెళ్లి వేళ.. అంత పెద్ద గొడవ జరిగిందట..

By:  Tupaki Desk   |   10 Nov 2022 6:31 AM GMT
కత్రినా పెళ్లి వేళ.. అంత పెద్ద గొడవ జరిగిందట..
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లికి సంబంధించిన షాకింగ్ నిజాన్ని వెల్లడించారు కత్రినా. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఈ పెళ్లిని అత్యంత ఆడంబరంగా జరిపారు.

ఈ పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు. అయితే.. కత్రినా పెళ్లి పీటల మీద కూర్చున్న వేళలో.. పెద్ద గొడవ జరిగిందని.. అక్కడ జరుగుతున్నది చూసి తాను గాబరా పడినట్లుగా తాజాగా కత్రినానే వెల్లడించటం విశేషం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ముచ్చట గురించి షేర్ చేసిన ఆమె.. బయటకు రాని ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. తాను పెళ్లి పీటల మీద కూర్చున్న వేళ.. తన వెనుక ఏదో పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో తాను వెనక్కి తిరిగి చూశానని.. అక్కడ పెద్ద గొడవ జరుగుతుందని.. తన కజిన్స్.. తన కాబోయే భర్త విక్కీ స్నేహితుల మధ్య ఏదో గొడవ జరుగుతుందన్న విషయం అర్థమైనట్లు చెప్పింది.

ఆ గొడవ ఎంత పెద్దది అంటే.. చెప్పులు.. కుర్చీలు ఒకరిపై ఒకరు విసిరేసుకున్న వైనం చూసిన తనకు ఏమీ అర్థం కాలేదని చెప్పింది. ఒకరిపై ఒకరు కుర్చీలు.. చెప్పులు విసిరేసుకుంటూ తిట్టేసుకుంటున్నారని.. కానీ ఆ సమయంలో తాను పెళ్లి పీటల మీద ఉండటంతో కిందకు వెళ్లలేకపోయినట్లు చెప్పారు.

అయితే.. ఆ గొడవలో ఎవరు గెలిచారన్న విషయాన్ని మాత్రం తాను తెలుసుకోవటం మర్చిపోయినట్లుగా చెబుతూ నవ్వేశారు.

ఇంతకీ.. గొడవకు కారణం ఏమిటి? అసలు అంతలా ఎందుకు తిట్టుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం కత్రినా రివీల్ ఛేయకపోవటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.