Begin typing your search above and press return to search.
కట్టప్పతో శివగామి రొమాన్స్!!
By: Tupaki Desk | 15 May 2017 9:37 AM GMTరాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచం మొత్తం పూనకం వచ్చిన మాదిరిగా ఈ సినిమా కోసం తపనపడ్డారు. అందులోని పాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత చెందాయి. ముఖ్యంగా బాహుబలి అతని మామ కట్టప్ప. ఈయనతో పాటు మరో పాత్ర కూడా అంతలా జానాలోకి వెళ్ళినది అంటే అది రమ్యకృష్ణ శివగామి. మాహిష్మతి సామ్రాజ్య రాజమాతగా ఆవిడ చేసిన నటన ప్రపంచం మొత్తం జై కొట్టారు.
ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటిoటే కట్టప్ప బహుబలిలో బానిసగా కనిపిస్తారు. రాజమాతకు విశ్వాసపాత్రుడిగా ఉండే పాత్ర చేశారు సత్యరాజ్. కాని రాజమాత అండ్ ఈ భానిస కలసి ఒక యాడ్ లో రొమాన్స్ చేశారు. అందులో కట్టప్ప సత్యరాజ్ రాజుగా కనిపిస్తారు. రమ్యకృష్ణ రాజమాతలా కాకుండా రాజ్యానికి రాణిగా కనిపిస్తారు. పోతిస్ యాడ్ వాళ్ళు బాహుబలి క్రేజ్ కూడా బాగానే మార్కెట్ చేసుకున్నారు. ఇది తమిళ్ వస్త్రాలయం కాబట్టి అక్కడ సత్యరాజ్ బాగానే ఫేమస్. రమ్యకృష్ణ కూడా నీలాంబరి పాత్ర తో ఇప్పుడు శివగామి పాత్ర లో తమిళనాడుకు సుపరిచతమే. అందుకని ఇలా ఎవ్వరూ అనుకోని కాంబినేషన్ తో వచ్చి బాహుబలి సినిమా అవుతున్నప్పుడు ఇంటెర్వెల్ లో ఈ యాడ్ ని ప్రసారం చేశారు.
సినిమా చూస్తున్నపుడు అందరూ రమ్యకృష్ణ సత్యరాజ్ ఊహించుకొన్న తీరు సడన్ గా యాడ్ లో కనిపించిన తీరు అక్కడ వచ్చినవారికి మింగుడు పడలేదు. క్రేజ్ ని వాడుకోవడం తప్పులేదు కానీ ఇలా ఎక్కడ వాడలో ఎరిగి సరైన టైమింగ్ లో వేస్తే ఆ క్రేజ్ని సరిగా వాడుకునట్టు అవుతుంది. ఏమైనా వాళ్ళకి మంచి మార్కెట్ ఆలోచనే వచ్చింది. యాడ్ మాత్రం అదిరింది కానీ బాహుబలి మధ్యలో పడేసరికి అందరికీ కాస్త నమ్మలేని నిజంగా చూశారు అంతే. పోతిస్ ప్రయోగం ఫలించింది అనే చెప్పాలి.