Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలి: క‌త్తి మ‌హేష్

By:  Tupaki Desk   |   21 April 2018 4:27 PM GMT
ప‌వ‌న్ ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలి: క‌త్తి మ‌హేష్
X
అన్నపూర్ణ స్టూడియోస్ లో నేడు 24 క్రాఫ్ట్స్ కు చెందిన సినీ ప్రముఖులంతా స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ స‌మావేశానికి వెళ్లిన కత్తి మహేష్ ను పవన్ అభిమానుల అడ్డుకున్నారు. దీంతో, మ‌హేష్ అక్కడ‌నుంచి వెనుదిరిగారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన మ‌హేష్ ...ప‌వ‌న్ ఫ్యాన్స్ పై మండిప‌డ్డారు. తాను కూడా రైట‌ర్స్ అసోసియేష‌న్ లో మెంబ‌ర్ అని, అందుకే 24 క్రాఫ్ట్స్ తో మీటింగ్ అన‌గానే వ‌చ్చాన‌ని అన్నారు. అయితే, అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ లేడని, తాను మీడియాతో మాట్లాడుతుండగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ...త‌న కారు మీద దాడికి ప్రయత్నించార‌ని అన్నారు. తాను పవన్ కళ్యాణ్‌తో మాట్లాడదాం అని వెళ్లానని, అత‌డికి సంఘీభావం వ్యక్తపరుద్దామ‌నుకున్నాన‌ని చెప్పారు.

తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందుకెళ్లాల‌ని, పరిశ్రమ కోసం పాటుప‌డాల‌ని , అనవసరపు రాజకీయాలు చేయ‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ కు సూచిద్దామని అక్క‌డ‌కు వెళ్లాన‌ని మ‌హేష్ అన్నారు. త‌ల్లి ఎవ‌రికైనా త‌ల్లేన‌ని....క్యాన‌ర్ తో రెండు సంవ‌త్స‌రాల క్రితం చ‌నిపోయిన త‌న త‌ల్లిపై ప‌వ‌న్ ఫ్యాన్స్....అస‌భ్యంగా దూషించిన‌పుడు ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌ని మ‌హేష్ ప్ర‌శ్నించారు. ఒక ద‌ళితుడి త‌ల్లి త‌ల్లి కాదా...అని ప్ర‌శ్నించారు. ఎవ‌రు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినా ప‌వ‌న్ ఫ్యాన్స్ మాట్లాడేది త‌ల్లి గురించే అని....త‌న‌నైనా శ్రీ‌రెడ్డినైనా వ‌ర్మ‌నైన వారు తిట్టే తొలి తిట్టే అదేన‌ని అన్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ , శ‌త‌ఘ్ని టీమ్ వారు త‌న‌ను త‌న త‌ల్లిని దూషించార‌ని వారిని క‌ట్ట‌డి చేయాల్సిన బాధ్య‌త ప‌వ‌న్ కు లేదా అని ప్ర‌శ్నించారు. వారంతా ప‌వ‌న్ కోసమే త‌న‌ను తిడుతున్నార‌ని, త‌న‌కు వారికి వ్య‌క్తిగ‌త విభేదాలు లేవ‌ని అన్నారు. శ్రీ‌రెడ్డి మీద కాద‌ని ...ఆమె లేవ‌నెత్తిన స‌మ‌స్య‌పై పోరాడాల‌ని, త‌న‌, మెగాఫ్యామిలీ వ్య‌క్తిగ‌తం ఎజెండాలా తీసుకోవ‌ద్ద‌ని కోరారు. ఏపీ రాజ‌కీయాల్లో మూడో ప్ర‌త్యామ్నాయం అవ‌స‌ర‌మేన‌ని, ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి అధికారం ద‌క్కాల‌ని తాను కూడా కోరుకుంటున్నాన‌ని మ‌హేష్ అన్నారు. అయితే, ముందు ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని సూచించారు. ప‌వ‌న్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు మీడియా కావాల‌ని, అటువంటి మీడియాను తిట్ట‌డం వ‌ల్ల ప‌వ‌న్ కు న‌ష్ట‌మేన‌ని క‌త్తి మ‌హేష్ అన్నారు.