Begin typing your search above and press return to search.
మల్టీపుల్ సర్జరీ.. కత్తి మహేష్ ఫుల్ హెల్త్ బులిటెన్
By: Tupaki Desk | 30 Jun 2021 10:30 AM GMTసినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నై - కోల్ కతా నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న మహేష్ కారు.. ముందు ప్రయాణిస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. అతన్ని నెల్లూరులోని ఓ ఆసుపత్రి తరలించారు.
అయితే.. పరిస్థితి విషమంగా మారడంతో.. వెంటనే చెన్నైకి తరలించారు. ఈ ప్రమాదంలో మహేష్ ముఖానికి, తలకు తీవ్ర గాలయ్యాయి. దీంతో ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. మహేష్ కళ్లు, ముక్కుతోపాటు మరికొన్ని ఎముకలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చాయి.
అంతేకాదు.. ఆయన ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయారని కూడా మీడియాలో ప్రసారమైంది. కంటి చూపు కోల్పోయిన విషయాన్ని బంధువులే తెలిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఆయన రెండు కళ్లూ బాగానే ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా.. కత్తి మహేష్ ఔటాఫ్ డేంజర్ అని వైద్యులు ప్రకటించారు.
అయితే.. ఆయనకు తగిలిన గాయాలు చాలా బలమైనవని తెలుస్తోంది. అందువల్ల.. మహేష్ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు. మహేష్ కు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియాలో పరస్పర విరుద్ధ చర్చ సాగిన సంగతి తెలిసిందే. మొత్తానికి.. మహేష్ ప్రాణాలకు ప్రమాదం లేదని తేలడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.