Begin typing your search above and press return to search.

కేబీసీలో రూ.5కోట్లు గెలిచిన వ్యక్తి దుస్థితి ఇదీ

By:  Tupaki Desk   |   24 Aug 2021 6:06 AM GMT
కేబీసీలో రూ.5కోట్లు గెలిచిన వ్యక్తి దుస్థితి ఇదీ
X
'కష్టపడకుండా ఏదీ రాదు.. ఒక వేళ వచ్చినా ఎన్నటికీ నిలవదు’ నరసింహా సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ .. ‘అదృష్టం వీడికి తలుపు తట్టింది.. కానీ దరిద్రం వెనక నుంచి లాగేసింది..’ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో చెప్పిన డైలాగ్. సినిమాల్లోని కొన్ని సీన్లు, డైలాగ్ లు.. రియల్ లైఫ్ లోనూ మనకు చాలా కనిపిస్తుంటాయి. కానీ మనం ఆ సినిమాలను వినోదం వరకే చూస్తాం. చాలా సినిమాల్లో డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో చెబతుంటారు. కానీ పట్టించుకోం.. అయితే రియల్ లైఫ్ లో అనుకోకుండా కోట్ల రూపాయల డబ్బు చేతికి వస్తే ఏం చేయాలి..? ఎలా ఉపయోగించుకోవాలి..? అనేది చాలా మంది తెలియదు. అలా ఓ వ్యక్తికి కూడా అనుకోకుండా రూ. 5కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. ఏమాత్రం కష్టపడకుండా రూ. 5 కోట్లు రావడంతో ఆ వ్యక్తి దానిని సరైన మార్గంలో ఉపయోగించుకోలేకపోయాడు. మరేం చేశాడో చదవండి..

సినిమాల కంటే టీవీ షో లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. వారికి అనుగుణంగా ఎమోషనల్ తో కూడా ప్రొగ్రామ్స్ తో ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఇక రియాలిటీ షో లకు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కేవలం ప్రశ్నలకు జవాబులు చెబితే చాలు వాటికి కేటాయించిన డబ్బును ఇచ్చేస్తారు. ఇలా ఈ షో ఐదో సీజన్ విజేత సుశీల్ కుమార్. ఈయన ఓ ప్రైవేట్ టీచర్. కేవలం కోటి రూపాయల వరకు వెళ్తాననుకున్న ఆయన రూ. 5కోట్ల విన్నరయ్యాడు. ఊహించని విధంగా ఆయన లైఫ్లోకొ ఒకేసారి రూ. 5కోట్ల డబ్బు వచ్చి చేరింది.

అయితే రూ. 5కోట్ల డబ్బును సుశీల్ కుమార్ హ్యాండిల్ చేయలేకపోయాడు. దీనిని సక్రమమైన మార్గంలో ఉపయోగించలేకపోయాడు. తనకు రూ.5 కోట్లు వచ్చిన తరువాత జరిగిన జీవితాన్ని ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో వివరించాడు. సుశీల్ జీవితం ఎక్కడ ఉండేదో.. మళ్లీ అక్కడికే చేరింది. ఈ సందర్భంగా సుశీల్ కుమార్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆయన జీవితంలో జరిగిన స్టోరీ ఆయన మాటల్లో.. ‘నాలుగేళ్ల కిందట నేనో సెలబ్రెటినీ. సినిమా హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఉండేది. అప్పటి వరకు నన్నెవరూ పట్టించుకోలేదు. కానీ రూ. 5 కోట్లు గెలుచుకున్నాక మా ఇల్లు సందడి గా మారింది. సన్మానాలు, సత్కారాలతోనే నెల రోజులు గడిచిపోయాయి. మాకు తెలియని వారు సైతం పెళ్లిళ్లకు పిలిచేవారు. వాస్తవానికి నేను కోటి రూపాయల వరకు వెళ్లడమే కష్టం. కానీ తెలివితేటలతో ప్రశ్నలకు జవాబు చెప్పడంతో రూ. 5కోట్లు గెలుచుకోగలిగా..’ అని చెప్పాడు.

‘అయితే నాకు ఒకేసారి ఇంత డబ్బు వచ్చేసరికి కొంచెం అహంగా ఫీలయ్యాను. చాలా మంది మా ఇంటికి వచ్చి సాయం చేయాలని కోరారు. అయితే వారి గురించి పూర్తిగా తెలియకుండా నెలకు కనీసం రూ. 50 వేలకు వరకు సాయం చేశాను. ఇదంతా చూసిన నా భార్య ఇలా డబ్బును దాన ధర్మాలు చేస్తే ఎలా..? అని వారించింది. అయితే వారి గురించి తెలుసుకొని సాయం చేయండి అని చెప్పేది. కానీ నేను నా భార్య చెప్పిన మాటలు పట్టించుకోలేదు. దీంతో ఆమెతో మనస్పర్థలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల తరువాత ఢిల్లిలో పని కోసం వెళ్లాను. అక్కడ జెఎన్ యూ విద్యార్థులతో కలిశాను వారు చెప్పిన కొన్న విషయాలకు అట్రాక్ట్ అయ్యాను .దీంతో మందు, సిగరెట్ కు అలవాటయ్యాను. ఈ పరిస్థితి చూసి నాభార్య నన్ను విడిచిపెట్టింది.

ఆ తరువాతో ఓ ఇంగ్లీష్ న్యూస్ రీడర్ ఫోన్ చేసి ఏదో కొశ్చన్ అడిగాడు. దానికి నేను అరవడంతో ఆ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో నేను తీవ్రంగా నష్టపోయానని అందరికీ తెలిసింది. చాలా మంది నన్ను పొగిడినోల్లు ఇప్పుడు తిడుతున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత జీవితం గురించి తెలుసుకున్నాను. అవసరమున్నంత వరకు డబ్బు సంపాదించి ఆ తరువాత పర్యావరణానికి ఖర్చు పెడుతున్నాను. మరోసారి జీవితంలో ఇలాంటి తప్పు చేయొద్దని నిర్ణయించుకున్నాను’ అని సుశీల్ కుమార్ తన గురించి చెప్పాడు.