Begin typing your search above and press return to search.
నానిపై పోలీస్ కేసు నమోదు కాబోతుందా?
By: Tupaki Desk | 18 Sep 2018 11:31 AM GMTటాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానికి క్లీన్ ఇమేజ్ ఉండేది. ఎప్పుడైతే బిగ్ బాస్ కు హోస్ట్ గా ఎంపిక అయ్యాడో అప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో నానిని ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మొదట ఎన్టీఆర్ తో పోల్చుతూ నాని సరిగా హోస్టింగ్ చేయడం లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత కౌశల్ ఆర్మీ రంగంలోకి దిగిన తర్వాత ప్రతి రోజు కూడా నాని ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా నానిపై ఏ స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరకు నాని పోలీస్ కేసును కూడా ఎదుర్కోవాల్సి రాబోతుందా అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
‘సిల్లీ ఫెలోస్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ మరియు అల్లరి నరేష్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో నాని పెదరాడు అంటూ ఒక కామెడీ స్కిట్ టైప్ లో ప్లాన్ చేశాడు. ఆ సమయంలోనే సునీల్ టీంలో కౌశల్ ఉండటం జరిగింది. కౌశల్ తల్లి పాత్రను పోషించాడు. ఆ తల్లి పాత్రను నాని ప్రశ్నిస్తూ.. ఇద్దరు కొడుకులను ఎందుకు దత్తత తీసుకున్నారు. మీ ఆయనతో స్పర్శ వర్కౌట్ కాలేదా అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యలను ప్రస్తుతం కౌశల్ ఆర్మీ గట్టిగా పట్టుకుంది.
సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి నానిపై కేసు నమోదు చేయాలని, ఆడవారిని గురించి అనుచితంగా మాట్లాడినందుకు గాను నానిపై కేసు బుక్ చేయాల్సింగా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్‌కు స్పందించిన హైదరాబాద్ పోలీసులు మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి అంటూ సమాధానం వచ్చింది. దాంతో ఇప్పుడు కౌశల్ ఆర్మీ మెంబర్స్ నానిపై కేసు ఫిర్యాదుకు సిద్దం అవుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అదే కనుక నిజం అయితే నాని చిక్కుల్లో పడ్డట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నానికి బిగ్ బాస్ వల్ల చుక్కలు కనిపిస్తున్నాయట.