Begin typing your search above and press return to search.
కౌశల్ సంచలన నిర్ణయం.. ఫౌండేషన్ రద్దు
By: Tupaki Desk | 5 March 2019 6:08 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ బయటకు వచ్చిన తర్వాత తన అభిమానులు ఏర్పాటు చేసిన కౌశల్ ఆర్మీని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అంటూ మార్చి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారికంగా రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ తరపున కౌశల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా చెబుతున్నాడు. మరో వైపు కౌశల్ ఆర్మీకి చెందిన మాజీ సభ్యులు కొందరు ఫౌండేషన్ కు సంబంధించిన డబ్బులను కౌశల్ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడంతో పాటు, అందరిని మోసం చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు.
కొందరు కౌశల్ ఆర్మీ మెంబర్స్ టీవీ 5 మూర్తి షోలో పాల్గొని సంచలన విషయాలను బయట పెట్టారు. అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ అంటూ కౌశల్ మరో ఛానెల్ కు వెళ్లి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను చూపించే ప్రయత్నం చేశాడు. అయినా కూడా కౌశల్ పై ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్ పై విమర్శలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లుగా ప్రకటించాడు.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని స్వయంగా కౌశల్ ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపేసి కొన్ని రోజుల తర్వాత ఫౌండేషన్ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకుని ఫౌండేషన్ కోసం కష్టపడే వారిని ఎంపిక చేస్తానంటూ ప్రకటించాడు. ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయి కమిటీలు మరియు జాతీయ స్థాయి కమిటీలన్నింటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కౌశల్ నిర్ణయంతో ఆయన అభిమానులు అంతా కూడా షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు వస్తున్న విమర్శలు నిజమే అయ్యి ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.