Begin typing your search above and press return to search.

పవన్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌ ను కూల్‌ చేసిన కౌశల్‌

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:55 PM GMT
పవన్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌ ను కూల్‌ చేసిన కౌశల్‌
X
విజయవాడలో హోటల్‌ లో రూం బుకింగ్‌ ఇష్యూలో పవన్‌ కళ్యాణ్‌ ను అవమానించినట్లుగా కౌశల్‌ మాట్లాడాడు అంటూ కౌశల్‌ ఆర్మీ నుండి బయటకు పంపించబడ్డ కొందరు వ్యక్తులు తాజాగా ఒక టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో చెప్పిన విషయం తెల్సిందే. వారి వ్యాఖ్యలతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో కౌశల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కౌశల్‌ ఫొటోలను చెప్పులతో కొడుతూ పెట్రోల్‌ పోసి తగులబెట్టడం జరిగింది. పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో కౌశల్‌ పై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వస్తున్న విమర్శలకు కౌశల్‌ సమాధానం ఇచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ గారిని తాను పల్లెతి మాట అనలేదు. వారు కావాలని చేస్తున్న ఆరోపణలు అవి, నాకు పవన్‌ కళ్యాణ్‌ గారంటే చాలా అభిమానం - ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఫాలో అవుతాను. ఆయన వ్యక్తిత్వం - ఆయన పట్టుదలను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని నేను బిగ్‌ బాస్‌ 2 విజేతగా నిలిచాను. నాకు ఆయన పలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం జరిగింది. బిగ్‌ బాస్‌ 2 లో విజేతగా నిలిచినప్పటి నుండి కూడా పవన్‌ కళ్యాణ్‌ గారిని కలవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఆయన వ్యక్తిగత సిబ్బందికి పదే పదే ఫోన్‌ లు కూడా చేశాను, వారు కూడా ఆ విషయం చెబుతారు. నేను పవన్‌ కళ్యాణ్‌ గారి గురించి విమర్శించాను అంటే ఎలా నమ్ముతారు అంటూ కౌశల్‌ ప్రకటించాడు.

ఇదే సమయంలో మహేష్‌ బాబు గారు అంటే కూడా నాకు చాలా అభిమానం అని, నేను మోడలింగ్‌ లో రాణించేందుకు మహేష్‌ బాబు గారు చాలా హెల్ప్‌ చేశారని కౌశల్‌ అన్నాడు. నేను ఆర్థికంగా ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా మహేష్‌ బాబు గారి సాయం కారణం అంటూ కౌశల్‌ చెప్పుకొచ్చాడు. ఇలా మహేష్‌ బాబు మరియు పవన్‌ ఫ్యాన్స్‌ ను చల్లార్చేందుకు - వారి మద్దతు పొందేందుకు కౌశల్‌ ప్రయత్నించాడు. మరి కౌశల్‌ మాటలను పవన్‌ - మహేష్‌ బాబు అభిమానులు విశ్వసిస్తున్నారా లేదా అనేది చూడాలి.