Begin typing your search above and press return to search.
క్యాన్సర్ తో పోరాడుతున్న నా భార్యనూ వదలడం లేదు
By: Tupaki Desk | 28 Feb 2019 12:36 PM GMTబిగ్ బాస్ సీజన్ 2 కు ముందు కౌశల్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఒకటి రెండు సీరియల్స్ లో మాత్రమే ఆయన కనిపించాడు. అయితే బిగ్ బాస్ 2 ప్రారంభం అయిన రెండు వారాల్లోనే కౌశల్ కు అనూహ్యంగా అభిమానులు పెరిగారు. దాంతో సునాయాసంగా కౌశల్ సీజన్ 2 విజేతగా నిలిచాడు. కౌశల్ ఆర్మీ కౌశల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వారు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించారు. అలాంటి కౌశల్ ఆర్మీ ఇప్పుడు కౌశల్ కు రివర్స్ అయ్యింది. కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు సభ్యులు ఇప్పుడు కౌశల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కు సంబంధించిన నిధులను కౌశల్ సొంత ఖర్చులకు వినియోగించాడని, ఆయనపై కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే కొందరు కౌశల్ ను మరియు ఆయన భార్య నీలిమాను టార్గెట్ చేసిన నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు కౌశల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. మీడియా సమావేశంలో కౌశల్ తనపై వస్తున్న అభియోగాలను కొట్టి పారేశాడు.
కౌశల్ ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి అమ్మాయిలతో చెడుగా ప్రవర్తిస్తున్నాడని అతడిని వెలివేయడం జరిగింది. అతడితో పాటు కొందరు ఇప్పుడు తనను వేదిస్తున్నారని, తన భార్య క్యాన్సర్ తో బాధపడుతు, నాకు సపోర్ట్ గా ఉండేందుకు ట్రీట్ మెంట్ కూడా తీసుకోకుండా నా వెంట వస్తుందని, ఆమెను కూడా వదలకుండా విమర్శించారంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలులో పర్యటించిన సమయంలో నా భార్యను పలు రకాలుగా వేధించారు. చంపేస్తాం, నరికేస్తామంటూ బెదిరించారు. అర్థరాత్రి సమయంలో మా కారుకు అడ్డు వచ్చి మమ్ములను మానసికంగా వేదించారు. కడుపులో 7 సెంటీమీటర్ల పొడవున క్యాన్సర్ గడ్డ నొప్పి పెడుతున్నా కూడా నా కోసం తను బాధను భరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉందని కౌశల్ అన్నాడు.
నన్ను హీరోగా చూడాలనేది నీలిమా కోరిక, నన్ను హీరోగా చేయాలనే ప్రయత్నంలో తను క్యాన్సర్ చికిత్సకు కూడా నో చెబుతూ వస్తోందని కౌశల్ పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వారు అంతా కూడా బిగ్ బాస్ లో తనతో పోటీ పడ్డ కంటెస్టెంట్స్ ప్రోత్సాహంతోనే ఇలా చేస్తున్నారంటూ కౌశల్ ఆరోపించాడు.