Begin typing your search above and press return to search.
చేయి పట్టుకుంటేనే ప్లేబాయ్..హగ్గులు..కిస్సులేంటి?
By: Tupaki Desk | 9 Oct 2018 1:30 AM GMTమనసుకు అనిపించింది చేయటం.. ఎవరేం అనుకున్నా పట్టించుకోకపోవటం.. వీలైనంతవరకూ ప్రాక్టికల్ గా ఉండటమేకాదు.. ఎమోషనల్స్ కు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. అందులోకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో వంద రోజులు ఉండటం.. మిగిలిన వారితో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండటం అంతే తేలికేం కాదు.
అయితే.. తాను చేసే పని మీద క్లారిటీతో చేసే కౌశల్.. చివరకు బిగ్ బాస్ సీజన్ 2లో విజేతగా నిలిచారు. అయితే.. హౌస్ లో మిగిలిన వారంతా ఒక జట్టు అయితే.. కౌశల్ ఒక్కడే మరో జట్టుగా ఉండటం కనిపించింది. విజేతగా కౌశల్ ను ప్రకటించినప్పుడు మిగిలిన వారిలో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇదిలా ఉంటే.. చేయి పట్టుకున్న కౌశల్ ను ప్లే బాయ్ అనటంపై కౌశల్ రియాక్ట్ అయ్యారు. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
సంజన చేతిని తాను ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని చెబుతూ.. "ఫస్ట్ డే - ఫస్ట్ ఎపిసోడ్ లో సంజన అనే కంటెస్టెంట్ జైల్లో ఉంది. తనను విడిపించడానికి నా దగ్గర ‘జైలు కార్డు’ ఉంది. కానీ నాకెందుకో ఆ అమ్మాయిని విడిపించాలనిపించలేదు. కాకపోతే తను ఫస్ట్ టైమ్ జైలుకు వెళ్లింది. జైలు కార్డు ఉండి కూడా విడిపించలేదనే భావనతో ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నా తరువాతి వారం నాని గారి ఓపెనింగ్.. ‘ప్లే బాయ్ కౌశల్’ అని! అన్నారు. నిజానికి నేను పెళ్లి అయిన వ్యక్తిని. ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకుంటేనే ప్లే బాయ్ ని అవుతానా? నన్నే ఆ మాట అంటే.. మిగిలిన వాళ్లు హగ్గులు - కిస్సులు - ఒకళ్ల మీద ఒకళ్లు కూర్చోవడాలు చూస్తే... వాళ్ల పరిస్థితి బయటెలా ఉంటుందా అనిపించింది. కానీ, ఎప్పుడైతే నన్ను ‘ప్లేబాయ్’ అన్నారో... అప్పటి నుంచి టచ్ కాదు కదా... అసలు ఎవరి దగ్గరికీ వెళ్లలేదు" అని చెప్పారు.
షోలో ఆడటానికి వెళ్లినప్పుడు రిలేషన్స్ పెట్టుకోవటంలో అర్థం లేదనే కౌశల్.. చివరకు సునయినను చెల్లి అంటూ రిలేషన్ కలపాల్సి వచ్చిందన్న విషయంపై క్లారిటీ ఇచ్చిన కౌశల్.. అసలు అలా ఎందుకు జరిగిందో చెప్పుకొచ్చాడు. ఒక టాస్క్ భాగంగా యజమాని చెబితే సేవకుడిగా చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆ అమ్మాయిని ఎత్తుకురా అన్నారు. ఆ అమ్మాయి దీప్తి సునయిన. పిల్లి వేషంలో ఉంది. పిల్లిని ఎలా పట్టుకుంటారో అలానే తనను పట్టుకొని తీసుకొచ్చా..ఆ సాయంత్రం ఆ అమ్మాయి.. తనను అలా పట్టుకోవటం నచ్చలేదని చెప్పింది. టాస్క్ లో భాగంగా తీసుకొచ్చానే కానీ మరే ఉద్దేశం లేదని.. తను నా చెల్లి లాంటిదని.. ఎందుకలా ఫీల్ అవుతానని చెప్పానన్నారు.
ఎవరితో బంధాలు కలుపుకోనని.. నిజానికి సునయిన తనకంటే పద్నాలుగేళ్లు చిన్నదని.. చెల్లెలుతో సమానం. అందుకే అనిపించే చెప్పానన్నారు.