Begin typing your search above and press return to search.
బాక్స్ ఆఫీస్: అందరికీ లిట్మస్ టెస్టే..!
By: Tupaki Desk | 7 Dec 2018 6:09 AM GMTప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే చోటు ఒక్క ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే. రిలీజ్ అయ్యే సినిమాలు అటూ ఇటూ అయితే సినిమా హీరో దగ్గర నుండి.. డైరెక్టర్ వరకూ ఇబ్బందే. అదే హిట్ అయితే వాళ్ళకు ఇండస్ట్రీతో పాటుగా ప్రేక్షకులు కూడా జేజేలు పలుకుతారు. ఈరోజు శుక్రవారం నాలుగు కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ సినిమాలకు పని చేసిన అందరికీ ఈరోజు పెద్ద పరిక్షే.
ఆ నాలుగు సినిమాలు ఏవంటే 'కవచం'.. 'నెక్స్ట్ ఏంటి'.. 'సుబ్రహ్మణ్యపురం'.. 'శుభలేఖ+లు'. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకూ చేసినవన్నీ భారీ సినిమాలే గానీ ఇప్పటివరకూ ఒక్క సాలిడ్ హిట్ కూడా దక్కలేదు. దీంతో 'కవచం' బడ్జెట్ విషయంలో జగ్రత్తపడ్డామని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా హిట్ కావడం బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు చాలా కీలకం. ఈ సినిమాతో శ్రీనివాస్ మామిళ్ళ అనే యువ దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సినిమా హిట్ అయితే టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికినట్టే.
'నెక్స్ట్ ఏంటి' విజయం లీడ్ యాక్టర్స్ తమన్నా.. సందీప్ కిషన్.. నవదీప్ ముగ్గురికీ కీలకమే. తమన్నా దాదాపుగా కెరీర్ చివరి స్టేజ్ లో ఉంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే అది తప్పని సరిగా తన కెరీర్ పై ప్రభావం చూపించేదే. ఇక సందీప్ కిషన్.. నవదీప్ ఇద్దరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు వాళ్ళు హిట్ అనే పదం విని చాలా ఏళ్ళయింది. వీళ్ళతో పోలిస్తే తమన్నా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ కునాల్ కోహ్లి టాలీవుడ్ లో తన లక్కు టెస్ట్ చేసుకుంటున్నాడు. ఆయనకు కూడా ఈ రిజల్ట్ కీలకమే.
'సుబ్రహ్మణ్యపురం' విజయం హీరో సుమంత్ కు చాలా ముఖ్యం. అసలు హిట్టే లేని పరిస్థితుల్లో తన లాస్ట్ సినిమా 'మళ్ళీ రావా' విజయం కాస్త రిలీఫ్ ఇచ్చింది. అలా అని అదేమీ సాలిడ్ హిట్ కాదు. దీంతో తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం అయిన 'సుబ్రహ్మణ్యపురం' విజయంపై నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంతోష్ జాగర్లమూడి కెరీర్ కూడా ఈ సినిమా విజయంపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు అందరూ కొత్తవారితో తెరకెక్కిన 'శుభలేఖ+లు' కూడా ఈ రోజే రిలీజ్ అవుతోంది. హిట్ అయితే కొత్తవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈమధ్య యంగ్ టాలెంట్ తో తెరకెక్కిన సినిమాలు విజయం సాధిస్తుండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో నని ప్రేక్షకులు కూడా ఈ చిత్రఫలితంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ శుక్రవారం రిలీజుల్లో ఏవి ప్రేక్షకుల ఆదరణ పొందుతాయో.. ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడతాయో సాయంత్రానికి తెలిసిపోతుంది.