Begin typing your search above and press return to search.

న్యూడ్ ఫోటోలతో అప్సెట్- ఎఫ్ బీ కి బై బై!

By:  Tupaki Desk   |   30 Aug 2018 6:51 AM GMT
న్యూడ్ ఫోటోలతో అప్సెట్- ఎఫ్ బీ కి బై బై!
X
సోషల్ మీడియా అంటే బ్యూటీ లు - వాళ్ళ అందమైన ఫోటోలు మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కనెక్టివిటీ అనే పాజిటివ్ యాస్పెక్ట్ పక్కనబెడితే సోషల్ మీడియా సవాలక్ష దరిద్రాలకు కేరాఫ్ అడ్రస్. ట్రోలింగ్ అనేది సెలబ్రిటీలకు పెద్ద బెడద. విమర్శించాలని ఎవరైనా అనుకుంటే మీరు ఏం చేసినా విమర్శించొచ్చు కదా. మీరు కేరళకు డొనేషన్ ఇవ్వకపోతే బూతులు తిడతారు. ఇస్తే ఎల్లయ్య కంటే ఎందుకు తక్కువ ఇచ్చావు? పుల్లయ్య చూపిన ఔదార్యంలో నీది పావు వంతేగా అని తిడతారు. అంటే 'డొనేషన్ రూల్ బుక్' వీళ్ళు రాస్తారా??

ఒక్క డొనేషన్లే కాదు... కాదేది ట్రోలింగ్ కు అనర్హం. ఈమధ్య కవిత కౌశిక్ అనే హిందీ నటి ఈ నెటిజనుల వెర్రి చేష్టలు భరించలేకపోతున్నానంటూ ఫేస్ బుక్ ను వదిలేస్తానని ప్రకటించింది. ఒక పెద్ద మెసేజ్ పెట్టి మరీ ఆ పని చేసింది. మార్ఫింగ్ చేసిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే దానికి ప్రధాన కారణం. ఫేస్ బుక్ ను వదిలేందుకు ఆమె కొన్ని కారణాలు చెప్పింది.

- ఫ్రెండ్సేమో పరిచయం లేని వాళ్ళతో వాదులాడుతూ ఉంటారు

- కొంతమంది రాజకీయపార్టీ క్యాండిడేట్ల లా ప్రవర్తిస్తారు

- మనమే కనుక ఒక నటి అయితే మార్ఫింగ్ చేసిన మన న్యూడ్ ఫోటోలను మనమే చూడాల్సి వస్తుంది.

- కుక్కల వీడియోలు పోస్ట్ చేస్తారు

ఇవన్నీ చూస్తుంటే నా అభిరుచులపై - నా సమయంపై జనాలు దాడి చేసినట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఇందులో నేను సెట్ కాను. 'దరిద్రాన్ని వదిలించుకో' అనే కొత్త కాన్సెప్ట్ ను ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను. మీరు దాన్ని ఏమైనా అనుకోండి. నావెనక చర్చలు పెట్టుకోండి. నేనైతే ఎఫ్ బీ ని వదిలేస్తున్నా. నేను చెప్పేది కొంతమందికి అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళు నా ఫోన్ నంబర్ ఉండేవాళ్ళు ఎప్పుడైనా నాకు కాల్ చెయ్యొచ్చు. ఇంట్లో ఫుడ్.. డ్రింక్స్ ఉన్నాయి. మనం సోషలైజ్ అవుతూ దేని గురించి అయినా మాట్లాడుకుందాం. ఇంకా సంతోషంగా ఉందాం. బై.

కొసమెరుపు ఏంటంటే ఫేస్ బుక్ ను మాత్రమే వదిలిందట. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మాత్రం అలాగే కంటిన్యూ చేస్తుందని ముంబై మీడియా టాక్.