Begin typing your search above and press return to search.
24 గంటల షోలతో రికార్డుల మోత!
By: Tupaki Desk | 12 Oct 2018 9:28 AM GMTగత కొంతకాలంగా మలయాళ హిస్టారికల్ మూవీ `కాయంకులమ్ కొచ్చున్ని` గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. యువహీరో నివిన్ పాళీ నటించిన భారీ చారిత్రక చిత్రమిది. ఆంగ్లేయుల కాలంలో నాడు కేరళకు చెందిన కొందరు దొంగలు చేసిన విరోచిత పోరాటం నేపథ్యంలో చిత్రీకరించిన మూవీ ఇది. ఈ సినిమా ఎన్టీఆర్ `అరవింద సమేత` రిలీజైన రోజే అంటే అక్టోబర్ 11న కేరళ వ్యాప్తంగా రిలీజైంది. దాదాపు 350 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని అత్యంత క్రేజీగా రిలీజ్ చేశారు.
ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ చేయని ప్రయోగం ఈ సినిమా కోసం నిర్మాతలు చేశారు. 24 గంటల మారథాన్ పేరుతో `కాయంకులమ్ కొచ్చున్ని` చిత్రాన్ని ప్రివ్యూలు ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా మల్లూవుడ్ లో పలు ఓపెనింగ్ రికార్డుల్ని బ్రేక్ చేసి సత్తా చాటింది. అధికారిక సమాచారం ప్రకారం 3.5 కోట్ల వరకూ ప్రీమియర్లతో డే1 వసూలు చేసిందని చెబుతున్నా ఈ చిత్రం 5 -6కోట్ల మధ్యలో వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వసూళ్లు `ది గ్రేట్ ఫాదర్` వసూళ్లను మించి ఉంటుందని - మోహన్ లాల్ నటించిన `మన్యం పులి` (పులి మురుగన్) రికార్డులు బ్రేక్ చేయనుందని విశ్లేషిస్తున్నారు.
రిలీజ్ ముందు ఈ సినిమాకి బోలెడంత హైప్ ని క్రియేట్ చేయడంతో ఓపెనింగులకు ఇది కలిసొచ్చింది. ఇక రివ్యూలు డీసెంట్ గా రావడంతో ఈ చిత్రం ఈ వీకెండ్ బాగానే వసూలు చేస్తుందన్న అంచనాలేర్పడ్డాయి. ఆసక్తికరంగా ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిధి పాత్రలోనూ మెరిశారు. లాల్ - నివిన్ పాళీ కాంబినేషన్ లోని ఓ మాస్ అవతార్ సన్నివేశం ట్రైలర్ లోనూ ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే ఓపెనింగులకు ఈ ప్రచార ఎత్తుగడ కలిసొచ్చిందని అంటున్నారు. అలానే 24 గంటల మారథాన్ వ్యవస్థ ఓపెనింగులకు బాగా అక్కరకొచ్చింది. టాలీవుడ్‌తో పోలిస్తే మల్లూవుడ్ బడ్జెట్‌లు ఎంతో పరిమితం. అయినా భారీ వసూళ్లు సాగిస్తుంటాయి. ఇక మోహనల్ లాల్ క్రేజుతో ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.