Begin typing your search above and press return to search.
కేసీఆర్ క్లాప్.. చంద్రబాబు కెమేరా స్విఛాన్
By: Tupaki Desk | 18 March 2018 9:24 AM GMTఒక సినిమా ప్రారంభోత్సవానికి ఇద్దరు చంద్రుళ్లు రానున్నారా? అంటే అవునంటున్నాయి సినీ వర్గాలు. ఇద్దరు చంద్రుళ్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే సినీ దిగ్గజం ఎవరున్నారన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. అంత స్థాయి ఉన్న అతి కొద్ది మందిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఏపీ ముఖ్యమంత్రికి బావమరిది కమ్ వియ్యంకుడైతే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు.
బాలకృష్ణ కోరినంతనే కేసీఆర్ అపాయింట్ మెంట్ ఫిక్స్ అవుతుందంటారు. మామూలుగా అయితే.. మంత్రులు సైతం కేసీఆర్ దర్శనం చేసుకోవాలంటే అంత తేలికైన ముచ్చట కాదని చెబుతారు. కానీ.. బాలయ్యకు మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను సినిమా తీయనున్నట్లుగా బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తాను పోషించనున్నట్లుగా చెప్పారు.
మార్చినెలాఖరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు చెబుతున్నారు. మార్చి 29న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం రామకృష్ణ స్టూడియోలో జరగనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని బాలయ్య ప్రత్యేకంగా పిలుస్తున్నట్లు సమాచారం. తన చిత్ర షూటింగ్ లో భాగంగా పలు ప్రాంతాల్లో షూట్ చేసుకోవటానికి ఇరువురు సీఎంలు సహకరించటంతో వారికి థ్యాంక్స్ చెప్పేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ మినహా మరెవరికీ ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ప్రారంభోత్సవానికి హాజరయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టనుండగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కెమేరా స్విచాన్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తారాగణాన్ని బాలకృష్ణ ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ వెండితెర మీదకు వచ్చే సమయం దగ్గరకు వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.