Begin typing your search above and press return to search.
కూతురుతో కలిసి మూవీ చూసిన కేసీఆర్
By: Tupaki Desk | 21 May 2017 1:49 PM GMTనిత్యం బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్.. కాస్తంత తీరిక చేసుకొని మూడు గంటల పాటు ఒక సినిమా కోసం కేటాయిస్తారా? అన్న డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే.. తాజాగా అలానే చేశారాయన. నిజానికి కేసీఆర్ కు సినిమాలన్నా.. పుస్తకాలన్నా చాలా ఇష్టమని చెబుతున్నారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు సినిమాల మీద పెద్ద ఫోకస్ చేయలేదు కానీ.. తర్వాతి కాలంలో ఆయన అప్పుడప్పుడు సినిమాలు చూడటం కనిపిస్తుంది.
సినిమాల మీద కేసీఆర్‌కు ఎంత ఇంట్రస్ట్ అన్న దానికి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవం రోజున.. ప్రత్యేక షో వేసి పిలిస్తే తాను వస్తానని.. తనకు తానే కేసీఆర్ చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఏదైనా సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే వెళ్లే కేసీఆర్.. ఆ సినిమాను చూస్తానని మాట ఇవ్వటం కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా నిఖిల్ నటించిన కేశవ మూవీని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుమార్తె కమ్ ఎంపీ కవిత కూడా చూశారట. సినిమా విడుదలైన శుక్రవారం ఈ మూవీ ప్రత్యేక షో వేసి మరీ చూపించారట. మూవీని చూసిన తర్వాత.. సినిమా బాగా తీశారని దర్శకుడ్ని కేసీఆర్ ప్రశంసించారట. మామూలు రివెంజ్ కథే అయినా.. తీసిన విధానం బాగుందని చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమాను ఎక్కడా సాగదీయకుండా తీసిన విధానం బాగుందని.. గుండె కుడి వైపున ఉండటం.. దాని వల్ల కలిగే ఇబ్బందులు ఎదురైనా.. హీరో ప్రతీకారం తీసుకున్న తీరును దర్శకుడు సుధీర్ వర్మ బాగా తెరకెక్కించినట్లుగా ప్రశంసించినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్.. కవితలు సినిమా చూడటంపై హీరో నిఖిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సినిమా కోసం ముఖ్యమంత్రి టైం స్పెండ్ చేయటంపై నిఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బుబ్బిపోతున్నాడు. ఆ విషయాన్ని అతగాడి ట్వీట్ చెప్పేస్తుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/