Begin typing your search above and press return to search.
కేసీఆర్ బయోపిక్ `ఉద్యమ సింహం` షురూ!
By: Tupaki Desk | 28 Jun 2018 3:22 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ `మహానటి` బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో రాబోతోన్న బయోపిక్ లకు `మహానటి` బెంచ్ మార్క్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో `ఎన్టీఆర్` - `యాత్ర`బయోపిక్ లు తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తాజాగా - తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. 'ఉద్యమ సింహం' పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ గురువారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా లాంచ్ అయింది. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి....కల్వకుంట్ల నాగేశ్వరరావు కథ అందిస్తున్నారు. ఆయన తన సొంత బ్యానర్ `పద్మనాయక ప్రొడక్షన్స్ ` లో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కేసీఆర్ పాత్రను ప్రముఖ నటుడు నాజర్ పోషించబోతున్నారు.
గతంలోనే కేసీఆర్ బయోపిక్ పై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ....కేసీఆర్ పాత్రలో నటించబోతున్నాడని టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా, కేసీఆర్ బయోపిక్ లో నాజర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ బాల్యం - రాజకీయ అరంగేట్రం - తెలంగాణ ఉద్యమం - విజయాలు - రాష్ట్ర సాధన వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఈ సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుందని తెలుస్తోంది. 2009 - నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో 2018 నవంబరు 29న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.