Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : సింహం సౌండ్ తగ్గిందే
By: Tupaki Desk | 14 March 2019 5:03 AM GMTబయోపిక్ ల సీజన్ టాలీవుడ్ లో విస్తృతంగా నడుస్తున్న టైంలో వస్తున్న మరో సినిమా ఉద్యమ సింహం. తెలంగాణా రాష్ట్ర విభజనకు ముందు జరిగిన పరిణామాలను నేపధ్యంగా తీసుకుని కేసీఆర్ ని హై లైట్ చేస్తూ తీసిన ఈ మూవీ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు విడిగా తెలంగాణ కావాలని పోరుబాట పడతారు కేసీఆర్. అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించినా ప్రతిపక్షాలు సహకరించకపోయినా వెనుదిరగకుండా నిరాహారదీక్ష చేసి మరీ సాధించిన వైనాన్ని కవరు చేశారు. స్థూలంగా ఇందులో చూపించిన కథ ఇదే.
కేవలం ఉద్యమం నేపథ్యం అందులో కేసీఆర్ పాత్ర తీసుకున్నారు తప్ప ఇది ఆయన పూర్తి బయోపిక్ కాదు. విషయానికి వస్తే చాలా తక్కువ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో అనుభవం లేని ఆర్టిస్టులతో చాలా సీరియస్ గా చెప్పాల్సిన నేరేషన్ ని ఆశించిన స్థాయిలో చూపించలేకపోయారు. సీనియర్ ఆర్టిస్ట్ సూర్య తప్ప ఇంకెవరు తెలిసిన మొహాలు కాకపోవడం కేసీఆర్ గా నటించిన ప్రధాన పాత్రధారి సైతం అంత ప్రభావితం చేసేలా కనిపించకపోవడం కొంత మైనస్ గానే ఉంది.
రెండు నిమిషాల ట్రైలర్ లోనే కొన్ని సన్నివేశాలు హడావిడిగా కొన్ని మొక్కుబడిగా కనిపిస్తున్నాయి. నేపధ్య సంగీతం ఒకే టోన్ లో సాగగా ఒకటి ఆరా సీన్లలో తప్ప ఇంకెక్కడా చెప్పుకోదగ్గ మేకింగ్ కనిపించలేదు. రోశయ్య సోనియా గాంధీ డాక్టర్ వైఎస్ఆర్ లగడపాటి తదితర కీలక పాత్రలన్ని సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ లోనే చూపించారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించిన మూవీకి కథ నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్ రావు. ఇలాంటి కథలకు బలంగా ఉండాల్సిన ఎమోషన్ తప్ప ఈ ఉద్యమ సింహంలో ఇంకేమి ఉన్నాయో విడుదలయ్యాక చూడాలి.