Begin typing your search above and press return to search.
రూ.300 కోట్ల చీటింగ్ పై స్పందించిన ప్రముఖ నిర్మాత
By: Tupaki Desk | 25 July 2020 9:30 AM GMTతమిళంలో స్టార్ నిర్మాతగా పేరు దక్కించుకున్న కేఈ జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదు అయ్యింది. తెలుగులో కూడా చాలా పాపులర్ అయిన ఈ నిర్మాత సూర్య మరియు కార్తీలతో భారీ చిత్రాలను తెరకెక్కించాడు. కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఈ నిర్మాత సన్నిహితులతో కలిసి చిట్ ఫండ్ సంస్థను నిర్వహించి ఖాతాదారులకు దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో హైకోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా జ్ఞానవేల్ రాజాకు నోటీసులు కూడా పంపించిందట.
జ్ఞానవేల్ రాజా రూ. 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డట్లుగా మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తరపు లాయర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఆయన కొట్టి పారేశాడు. నీతిమణి ఆయన భార్య మేనక మరియు ఆనంద్ అనే ముగ్గురు బిన్ టెక్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో మణికంఠన్ తో పాటు మరో 58 మంది డబ్బు పెట్టారు. అయితే వారిని నీతిమణి ఇంకా ఆనంద్ లు మోసం చేశారని తెల్సింది. ఈ విషయమై మణికంఠన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ చిట్ ఫండ్ సంస్థతో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా జ్ఞానవేల్ రాజా పేరును ఇరికించారు.
ఆ చిట్ ఫండ్ సంస్థ నుండి జ్ఞానవేల్ గతంలో తన సినిమాలకు ఫైనాన్స్ తీసుకున్నాడు తప్ప అంతకు మించి ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది అన్నాడు. ఆ చిట్ సంస్థ తనను మూడు కోట్లకు మోసం చేసిందని మణికంఠన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాని మీడియాలో మాత్రం 300 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానంటూ జ్ఞానవేల్ రాజా న్యాయవాది ద్వారా మీడియాను హెచ్చరించాడు. ఈ కేసు విషయంలో తాను లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత విచారణకు హాజరు అవుతానంటూ కోర్టుకు జ్ఞానవేల్ రాజా వివరణ ఇచ్చాడట.