Begin typing your search above and press return to search.

తమిళ నిర్మాత తెలుగులో బాగానే మరిగాడు

By:  Tupaki Desk   |   14 Jun 2016 1:30 PM GMT
తమిళ నిర్మాత తెలుగులో బాగానే మరిగాడు
X
జ్నానవేల్ రాజా.. సూర్య సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. సూర్యకు ఇతను కజిన్ అవుతాడు. ఈ మధ్య ‘24’ సినిమాతో తెలుగులో మంచి లాభాలే అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. ముందు ఈ చిత్ర హక్కుల్ని హోల్‌ సేల్ గా ఓ బయ్యరుకు అమ్మేసి.. ఆ తర్వాత వైజాగ్ ఏరియాకు మళ్లీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం విశేషం. ‘24’ ఉత్తరాంధ్రలో అంచనాల్ని మించి ఆడింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో సైతం ఈ సినిమా బాగానే ఆడింది. మరోవైపు తమిళంలో మాత్రం ‘24’కు ఆశించిన స్పందన రాలేదు. తమిళనాట జ్నానవేల్ డిస్ట్రిబ్యూట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘ఇరైవి’ కూడా అతడికి మంచి ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో జ్నానవేల్ తెలుగు మార్కెట్ మీద దృష్టిసారిస్తున్నాడు.

తొలిసారి తనకు సంబంధం లేని ఓ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు జ్నానవేల్ రాజా. సీనియర్ డైరెక్టర్ కోడిరామకృష్ణ కన్నడలో రూపొందించిన గ్రాఫిక్స్ మూవీని తెలుగులో ‘నాగభరణం’ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కుల్ని జ్నానవేలే సొంతం చేసుకోవడం విశేషం. ఫ్యాన్సీ రేటు ఇచ్చి సినిమాను కొన్నాడట జ్నానవేల్. ఓ భాషకు చెందిన నిర్మాతలు ఇంకో భాషలోకి వెళ్లి సినిమాలు నిర్మించడం మామూలే కానీ.. ఇలా హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడం అరుదు. ఏడేళ్ల కిందటే చనిపోయిన సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ ను గ్రాఫిక్స్ ద్వారా పున:సృష్టించి ఈ సినిమాను తెరకెక్కించాడు కోడిరామకృష్ణ. వందల సంఖ్యలో వీఎఫెక్స్ నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.