Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసం చిత్ర - సునీత దిగారు
By: Tupaki Desk | 7 Sep 2018 12:13 PM GMTఎన్టీఆర్ బయోపిక్ అంతంతకు వేడి పెంచుతోంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో బాలకృష్ణ - చంద్రబాబు పాత్రలో రానా - బసవతారకం పాత్రలో విద్యాబాలన్ - నాదెండ్ల పాత్రలో సచిన్ ఖండేల్కర్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రకుల్ - రాశీ ఖన్నా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బయోపిక్ అంతకంతకు భారీ స్టార్ కాస్టింగ్ - టాప్ టెక్నీషియన్లతో ఉరకలెత్తుతోంది. ప్రస్తుతం సినిమాకి జీవం పోసే అత్యంత కీలకమైన పాటల్ని రెడీ చేస్తున్నారు.
కెరీర్‌లో బెస్ట్ టీమ్‌తో క్రిష్ రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. పనిలో పనిగా మరకతమణి ఎం.ఎం.కీరవాణి సైతం ఈ టీమ్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. నటసార్వభౌముడిపై సినిమా కావడంతో అన్ని డిపార్ట్ మెంట్ లు ఎంతో ఎలర్టుగా పని చేస్తున్నాయని అర్థమవుతోంది. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన బాణీల్ని రెడీ చేస్తున్నారట. పైగా మేటి నేపథ్య గాయని చిత్ర - గ్రేట్ సింగర్ సునీతలతో కలిసి పాటలు పాడిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు. ఆ మేరకు చిత్ర, కీరవాణి స్వయంగా సామాజిక మాధ్యమాల్లో రికార్డింగ్ ఫోటోల్ని పోస్ట్ చేశారు.
చాలా కాలం తర్వాత కీరవాణితో కలిసి పని చేస్తున్నానని సీనియర్ గాయని చిత్ర ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర - సునీత మైక్ షేర్ చేసుకోవడం గుర్తుంచుకోదగ్గ సందర్భం! అంటూ కీరవాణి తన అభిప్రాయాన్ని అభిమానులకు షేర్ చేశారు. ప్రతిభకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి దశాబ్ధాల పాటు పరిశ్రమని ఏలిన ఇలాంటి సీనియర్ గాయనీమణులు ఈ సినిమాకి పాడడం వన్నె తెస్తుందనడంలో సందేహం లేదు. ఓవైపు నవతరం గాయనీ గాయకులకు అవకాశాలిచ్చే కీరవాణి - ఇలా సీనియర్లను అవసరం మేర బరిలో దించడం చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ కి సంగీతం పరంగా ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.