Begin typing your search above and press return to search.

సింగర్లతో ఆ డ్యాన్సులేంటున్న కీరవాణి

By:  Tupaki Desk   |   4 March 2018 5:30 PM GMT
సింగర్లతో ఆ డ్యాన్సులేంటున్న కీరవాణి
X
గతంలో గాయనీ గాయకులు పాటలు పాడే తీరు ఎలా ఉండేదో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటికి వస్తున్నాయి. పాటలు పాడుతూ సింగర్లు ఊగిపోవడం.. నవ్వడం.. గంతులేయడం ఆ వీడియోల్లో చూస్తున్నాం. ఇలాంటివి తగదని అంటున్నాడు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి. ఇలా చేయడం వల్ల సింగర్లకు పాట మీద.. సాహిత్యం మీద దృష్టి ఉండటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి పాటకు అసలు సాహిత్యంతో పని లేకుండా పోతోందని.. తెలుగులో చక్కగా రాయగలిగే గీతకారులకు కూడా ప్రస్తుతం పని లేదని కీరవాణి కుండబద్దలు కొట్టేశారు.

ఇక పాటలు పాడేటపుడు గాయకులు డ్యాన్స్ చేయడాన్ని తప్పుబట్టిన కీరవాణి.. వాళ్లు కూర్చుని పాడేలా చూడాలని అన్నారు. అప్పుడే పాడుతున్న పాటపై. అందులోని సాహిత్యంపై దృష్టి ఉంటుందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు. తాను అన్ని భాషల్లోనూ పాటలు వింటుంటానని.. ఇప్పుడు దాదాపుగా ఒకటే ట్రెండ్ నడుస్తోందని... భాష మారుతున్నప్పటికీ సంగీతం ఒకేలా నడుస్తోందని.. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్‌ తో అనుసంధానమై ఉండటం వల్ల అన్ని చోట్లా పాటలు ఒకేలా ఉంటున్నాయని కీరవాణి అన్నారు. ఇన్నాళ్ల తాను డబ్బుల కోమే పని చేశానని.. ఐతే ఇకపై తాను డబ్బుల కోసం సినిమాలు చేయనని.. కథ అన్ని రకాలుగా నచ్చితేనే సంగీతం చేయాలని డిసైడయ్యానని.. అందుకు తగ్గట్లే సాగుతున్నానని కీరవాణి స్పష్టం చేశారు.