Begin typing your search above and press return to search.
కీరవాణి ‘జై బాలయ్య’ నినాదంపై దుమారం
By: Tupaki Desk | 1 Sep 2017 6:18 PM GMT తెలుగు సాహిత్య విలువలు పడిపోవడం గురించి ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరతీశాడు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. అప్పట్లో ఆయన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగింది. ఇండస్ట్రీ జనాల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కొన్నారాయన.
తాజాగా కీరవాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. శుక్రవారం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ ఫస్ట్ డే ఫస్ట్ సందర్భంగా థియేటర్లో బాలయ్య అభిమానుల కోలాహలం చూసిన ఉత్సాహంలో ఆ తర్వాత కీరవాణి ఒక ట్వీట్ చేశారు. జైహింద్ అనేటపుడు ఎంత ఎమోషన్ ఉంటుంటో.. ‘జై బాలయ్యా’ అనడంలోనూ అంతే ఎమోషన్ కనిపిస్తోందన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగింది. ‘జైహింద్’ నినాదంతో ‘జై బాలయ్య’ స్లోగన్ ను ఎలా పోలుస్తారంటూ కీరవాణిని తప్పుబట్టారు నెటిజన్లు. ఇదేం దేశభక్తి అంటూ ప్రశ్నించారు. కీరవాణికి ఈ విషయంలో కులం మకిలి కూడా అంటించే ప్రయత్నం చేశారు కొందరు. ఐతే ఈ విమర్శలపై కీరవాణి దీటుగా స్పందించాడు. తన దేశభక్తిని ఎవరూ శంకించలేరని.. ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని.. తాను గత ఎన్నికల్లో ఓటేశానని.. మరి మీరు ఓటేశారా అని కీరవాణి ప్రశ్నించాడు. తాను ‘అర్జున్ రెడ్డి’ సినిమి కాస్ట్ అండ్ క్రూను కూడా పొగిడానని.. మరి వాళ్ల కులాలేంటని ప్రశ్నించాడు కీరవాణి.