Begin typing your search above and press return to search.
రాజమౌళికి కౌంటరేసిన అన్నయ్య..
By: Tupaki Desk | 4 March 2018 7:37 AM GMTదర్శక ధీరుడు రాజమౌళి తాను నాస్తికుడినని పలు సందర్భాల్లో ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే నాస్తికుడినని ప్రకటించుకుని కూడా ఆయన గుడికి వెళ్లడంపై బాబు గోగినేని లాంటి హేతువాదులు అభ్యంతరం వ్యక్తం చేయడమూ తెలిసిన విషయమే. నిజంగా రాజమౌళి మనసేంటన్నది ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలి. ఇదిలా ఉంటే రాజమౌళికి అత్యంత ఆప్తుడైన ఆయన అన్నయ్య కీరవాణి మాత్రం తాను దేవుడిని నమ్ముతానని అంటున్నారు. అంతే కాదు.. దేవుడిని నమ్మని వాళ్లంటే తనకు గౌరవం లేదని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా దేవుడి పట్ల మీ అభిప్రాయం ఏంటని కీరవాణిని అడిగితే.. తనకు దేవుడంటే నమ్మకం ఉందని కీరవాణి చెప్పారు. మనల్ని మించిన శక్తి ఏదో నడిపిస్తోందని.. దాని అధీనంలోనే మనమంతా ఉన్నామని తాను నమ్ముతానని కీరవాణి చెప్పాడు దేవుడున్నాడని నమ్మే వాళ్లనే కాక.. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అని మధ్యస్తంగా ఉండేవాళ్లను కూడా తాను గౌరవిస్తానని కీరవాణి తెలిపాడు. ఐతే దేవుడు లేడు అనే నాస్తికుల పట్ల మాత్రం తనకు గౌరవ భావం లేదని తేల్చి చెప్పేశాడు కీరవాణి. ఐతే స్వయంగా రాజమౌళే తనకు దేవుడి మీద నమ్మకం లేదని.. తాను నాస్తికుడినని ప్రకటించిన నేపథ్యంలో తన తమ్ముడంటే కీరవాణికి గౌరవం లేదనుకోవాలా? ఇంతకీ వాళ్లిద్దరి మధ్య ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరుగుతుంటాయో?