Begin typing your search above and press return to search.
కీరవాణి చెబితే మార్చాల్సిందే-రాజమౌళి
By: Tupaki Desk | 1 July 2015 3:30 PM GMTటాలీవుడ్‌లో ఇప్పటిదాకా రాజమౌళి తొమ్మిది సినిమాలు తీశాడు. ఆ తొమ్మిదీ హిట్లే. ఫెయిల్యూర్ అన్నదే లేదు. అలాగని తాను చేసిందంతా కరెక్ట్.. తాను తీసేదంతా జనాలకు నచ్చుతుందనే అతి విశ్వాసం తనకు లేదని అంటున్నాడు రాజమౌళి. తన సినిమాలకు సంబంధించి ఎవరైనా తప్పులు వెతికితే తానేమీ మరోలా భావించనని చెబుతున్నాడు రాజమౌళి. ముఖ్యంగా తన సినిమాల విషయంలో తన పెద్దన్నయ్య (కజిన్) కీరవాణి ఏం బాగోలేదని చెప్పినా మార్చడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పాడు రాజమౌళి.
''పెద్దన్నది 230 సినిమాల అనుభవం. ఆయన్ని కేవలం ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను చూడను. ఆ 230 సినిమాలకు సంబంధించి రా ఔట్‌పుట్‌ను ఆయన చూసి ఉంటారు. తర్వాత రీరికార్డింగ్‌తో దానికి సొబగులద్ది ఉంటారు. మరోసారి సినిమా చూసి తాను చేసింది పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని చూసి ఉంటారు. ఆపై జనాల రెస్పాన్స్ కూడా తెలుసుకుని ఉంటారు. సినిమాల జడ్జిమెంట్ విషయంలో ఆయనకు ఎంత అనుభవం వచ్చి ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే నా సినిమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయనతో చర్చిస్తాను. ఆయన అభిప్రాయాలకు చాలా విలువ ఇస్తాను. కొన్నిసార్లు మామధ్య కూడా వాదనలు జరుగుతుంటాయి. కానీ ఎక్కువసార్లు ఆయన అభిప్రాయానికే ఓటేస్తాను. ఏదైనా సన్నివేశం బాగాలేదు.. ఎమోషన్ క్యారీ అవ్వలేదు అని చెబితే రీషూట్ చేస్తుంటాను బాహుబలి సినిమా ఎడిటింగ్ విషయంలో పెద్దన్నతో పాటు నాన్నగారు నాకెంతో సాయం చేశారు'' అని చెప్పాడు రాజమౌళి.