Begin typing your search above and press return to search.
వర్మతో ఎలా ఒప్పుకున్నాడబ్బా?
By: Tupaki Desk | 4 July 2020 8:50 AM GMTకీరవాణి ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు. ఒకప్పుడు ఇబ్బడిముబ్బడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటి కంటే ఇప్పుడు ఆయన ఉన్నత స్థాయిలోఉన్నారు. అందుక్కారణం తన తమ్ముడు రాజమౌళితో సాగిస్తున్న ప్రయాణం. మూడు దశాబ్దాల కెరీర్లో 2015 ముందు వరకు చేసిన సినిమాలతో వచ్చిన గుర్తింపు ఒకెత్తయితే.. ‘బాహుబలి’తో వచ్చిన గుర్తింపు మరో ఎత్తు. ఈ సినిమాతో దేశం నలు మూలలా ఆయన పేరు వినిపించింది. ఆయన సంగీతానికి ఎనలేని పేరొచ్చింది.
ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి అన్న గుర్తింపు ఎప్పటికీ నిలిచిపోయేదే. ఐతే అంత స్థాయి ఉన్న కీరవాణి.. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకు పని చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘12 ఓ క్లాక్’కు సంగీత దర్శకుడు కీరవాణే.
వర్మతో కీరవాణికి ఇదే తొలి సినిమా కాదు. ఇంతకుముందు వీరి కలయికలో ‘క్షణక్షణం’ లాంటి క్లాసిక్ వచ్చింది. ఇంకా వర్మ రూపొందించిన, నిర్మించిన రెండు మూడు సినిమాలకు కీరవాణి పనిచేశారు. కానీ ఒకప్పుడు వర్మతో పని చేయడం వేరు. ఇప్పుడు ‘క్లైమాక్స్’, ‘నేక్డ్’ లాంటి బూతు సినిమాలు తీస్తున్న వర్మతో పని చేయడం వేరు. కాస్త పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు వర్మతో పని చేయడానికి భయపడుతున్నారు. ఆయనతో పని చేస్తే తమ స్థాయి ఎక్కడ పడిపోతుందో అని వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కీరవాణి వర్మ సినిమాకు సంగీతం సమకూర్చడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐతే వర్మ ఇప్పుడే స్థాయిలో ఉన్నాడన్నది పక్కన పెట్టి ఒకప్పుడు ఆయనతో స్నేహం, తనపై ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రొఫెషనల్‌లా ఆలోచించి ఈ సినిమాకు మ్యూజిక్ చేసినట్లున్నాడు కీరవాణి. ఐతే ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఎప్పుడూ చూసిన విజువల్స్, విన్న సౌండ్స్ తప్ప కొత్తగా అయితే ఏమీ కనిపించలేదు. కాకపోతే పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు పని చేసిన నేపథ్యంలో వర్మ ఈ మధ్య తీస్తున్న నాసిరకం, బూతు సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం మెరుగ్గా ఉండొచ్చన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.