Begin typing your search above and press return to search.
రాజమౌళికి.. రాఘవేంద్రరావుకు తేడా అదే
By: Tupaki Desk | 6 March 2018 2:30 AM GMTరాఘవేంద్రరావు 90ల దగ్గర్నుంచి ఏ సినిమా చేసినా.. సంగీత దర్శకుడిగా మాత్రం కీరవాణే ఉండేవాడు. ఇక రాజమౌళి తన కెరీర్ ఆరంభం నుంచి కీరవాణి తప్ప మరో సంగీత దర్శకుడితో పని చేయలేదు. వీళ్లిద్దరికీ కీరవాణితో అంత బాగా సింక్ అయింది. వాళ్ల వ్యక్తిత్వాలు.. దర్శకత్వ శైలి.. సంగీతం విషయంలో అభిరుచి గురించి కీరవాణికి బాగా తెలుసు. అందుకే వాళ్లతో దశాబ్దాల పాటు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ గురు శిష్యులిద్దరి గురించి ఎప్పుడు మాట్లాడినా ఆసక్తికర విషయాలు చెబుతారు కీరవాణి. వాళ్ల గురించి కీరవాణి చేసే విశ్లేషణ కూడా చాలా బాగుంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు.. రాజమౌళిల మధ్య తేడా ఏంటో ఆసక్తికర రీతిలో చెప్పాడు కీరవాణి. వీళ్లిద్దరిలోనూ ఒక విషయంలో వైరుధ్యం ఉందని కీరవాణి తెలిపాడు. రాఘవేంద్రరావు ప్రయోగాలు చేయడానికి కొంచెం ఆలోచిస్తారని.. ఆయన దగ్గర కొత్తవాళ్లకు అంతగా ఛాన్స్ దొరకదని కీరవాణి చెప్పాడు. ఐతే రాజమౌళి అలా కాదని.. కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడడని అన్నాడు. రాఘవేంద్రరావు మొక్కని తన పెరట్లో పెంచుకుని దాన్ని మహావృక్షంగా మార్చడంలో నేర్పరి అయితే.. రాజమౌళి విత్తనం వేసి.. దాన్ని మొక్కగా పెంచగలడని చెప్పాడు. ఇదే వాళ్ల మధ్య తేడా అన్న కీరవాణి.. వారిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం.. ఇద్దరూ అలవాటైన వ్యక్తులతోనే పని చేయడానికి ఇష్టపడతారని.. టెక్నీషియన్లను మార్చడం నచ్చదని తెలిపాడు.