Begin typing your search above and press return to search.
సైజ్ జీరో.. ఫుల్ కనెక్టైపోయా-కీరవాణి
By: Tupaki Desk | 19 Nov 2015 5:30 PM GMTసైజ్ జీరో యూనివర్శల్ సినిమా అంటున్నాడు కీరవాణి. తన లాంటి బొద్దుగా ఉండే వాళ్లందరూ ఈ సినిమాతో ఈజీగా కనెక్టయిపోతారంటున్నారాయన. సన్నగా ఉన్నోళ్లను కూడా ఈ సినిమా ఆలోచింపచేస్తుందని.. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వర్గాల వారికి కనెక్టయ్యే ట్రెండీ కాన్సెప్ట్ తో ‘సైజ్ జీరో’ తెరకెక్కిందని చెప్పారు కీరవాణి. తాను సంగీతం అందించే సినిమాల గురించి పెద్దగా మాట్లాడని కీరవాణి.. ‘సైజ్ జీరో’ గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. తన కెరీర్ లో ఇదో భిన్నమైన సినిమా అని ఆయనన్నారు.
రాఘవేంద్రరావు కుటుంబంతో తనది పాతికేళ్ల అనుబంధమని.. ఆయన తనయుడు ప్రకాష్ కోవెల మూడి తనకు చిన్నప్పట్నుంచి తెలుసని.. అతడు తీయబోయే సినిమా అనగానే సినిమా ఒప్పేసుకున్నానని.. తర్వాత ప్రకాష్ భార్య కనిక చెప్పిన కథకు వెంటనే కనెక్టయిపోయానని కీరవాణి చెప్పారు. తెలుగు - తమిళ ప్రేక్షకులను సమానంగా ఈ చిత్రం అలరిస్తుందని కీరవాణి చెప్పారు. రెండు వెర్షన్లకూ ఒకే ట్యూన్లు ఇచ్చానని.. ఐతే వేర్వేరు సింగర్స్ తో పాడించానని.. ‘బాహుబలి’కి పాటలు రాసిన మదన్ కార్కీతోనే తమిళ పాటలకు లిరిక్స్ రాయించుకున్నానని.. అతడితో తనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని కీరవాణి చెప్పాడు.