Begin typing your search above and press return to search.

సంబంధం లేని వేడుకలో నారా రోహిత్‌ పై పొగడ్తలు

By:  Tupaki Desk   |   12 Feb 2018 7:19 AM GMT
సంబంధం లేని వేడుకలో నారా రోహిత్‌ పై పొగడ్తలు
X
అది ‘జువ్వ’ సినిమా వేడుక. ఇందులో రంజిత్ అనే కొత్తబ్బాయి హీరోగా నటించాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వి.వి.వినాయక్ వచ్చాడు. ఇంకా హీరో బంధువైన బొత్స సత్యనారాయణతో పాటు ఇంకొందరు అతిథులు వచ్చారు. అక్కడ నందమూరి హీరోలెవ్వరూ లేరు. అలాగే నారా కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేరు. అన్నిటికీ మించి నారా రోహిత్ లేడక్కడ. కానీ తన ప్రసంగంలో భాగంగా నారా వారబ్బాయిని తెగ పొగిడేసి ఆశ్చర్యపరిచాడు కీరవాణి. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల గురించి వక్తలు అసందర్భంగా పొగడ్డం మామూలే కానీ.. ఇలా నారా రోహిత్ లాంటి ఒక యంగ్ హీరోను కీరవాణి లాంటి లెజెండ్ ఇలా పొగడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంతకీ నారా రోహిత్ ను కీరవాణి పొగడ్డానికి కారణమేంటంటే.. అతను ఎంచుకునే కథలే. రోహిత్ అందరిలా మాస్ కథలు ఎంచుకుని సినిమాలు చేయట్లేదని.. అతను ఎంచుకునే కథలు చాలా కొత్తగా.. విచిత్రంగా ఉంటాయని.. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదని.. అందుకే అతను తనకు నచ్చుతాడని కీరవాణి చెప్పడం విశేషం. రంజిత్ కూడా అలా వైవిధ్యమైన కథలు ఎంచుకుని రోహిత్ లాగా పేరు తెచ్చుకోవాలని కీరవాణి అన్నాడు. కీరవాణి మాటలు అతిశయోక్తి ఏమీ లేదు. రోహిత్ బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే అతను అందరు వారసుల్లా మాస్ కథలు ఎంచుకుంటాడని అనుకున్నారు. కానీ తొలి సినిమా ‘బాణం’ దగ్గర్నుంచి వైవిధ్యమైన సినిమాలతోనే ప్రయాణం సాగిస్తున్నాడు రోహిత్. ఈ క్రమంలో కెరీర్ కొంచెం ఒడుదొడుకులతో సాగుతున్నా అతనేమీ వెనకడుగు వేయట్లేదు. ఇప్పుడు రోహిత్ చేస్తున్న ‘వీర భోగ వసంతరాయలు’ కూడా కొత్త తరహా సినిమానే.