Begin typing your search above and press return to search.
“ఆర్ఆర్ఆర్” కోసం పెద్ద మొత్తాన్ని పారితోషికం తీసుకుంటున్న కీరవాణి!
By: Tupaki Desk | 4 Aug 2021 6:37 AM GMTసంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించి మూడు దశాబ్దాలు పైనే అయ్యింది. ఇన్నేళ్ల కెరీర్ లో కీరవాణి అయిదు భాషల్లో కలిపి 150 పైనే చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” కూడా ఆయన సంగీత సారథ్యంలోనే రాబోతుంది. ఇటీవల విడుదలైన దోస్తీ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తోంది.
సినిమాలకి అదిరిపోయే స్వరాలందించే కీరవాణి “ఆర్ఆర్ఆర్” కోసం పెద్ద మొత్తాన్నే పారితోషికంగా వసూలు చేస్తునట్టు సమాచారం. నిర్మాతలు “ఆర్ఆర్ఆర్” కోసం కీరవాణి కి రూ.18 కోట్లు సమర్పించినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. డిడ్ ఎంత వరకూ నిజమనే విషయం నిర్మాతలే చెప్పాలి.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన దోస్తీ సాంగ్ 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది. ఐదు భాషల్లో ఈ పాత విడుదల కాగా, ఆ భాషల్లో పేరుమోసిన గాయకులూ దోస్తీ పాటని పాడారు.
బాహుబలి చిత్రం తో అందరి దృష్టినీ ఆకర్షించిన రాజమౌళి “ఆర్ఆర్ఆర్" ని తెరకెక్కిస్తున్నాడు. బృందం ఇటీవల ఉక్రెయిన్ కి పయనమైంది. ఎన్ఠీఆర్, రామ్ చరణ్ ముఖ్య పత్రాలు పోషించే “ఆర్ఆర్ఆర్" ఈ సంవత్సరం అక్టోబర్ 13 న థియేటర్ లో దేశవ్యాప్తంగా విడుదలవుతుందని ఇటీవల నిర్మాతలు తెలిపారు.
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మారిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ఈ పాన్ ఇండియా చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు