Begin typing your search above and press return to search.

2.0: బుల్లిగువ్వా అంటూ పాడుతున్న కీరవాణి

By:  Tupaki Desk   |   7 Nov 2018 9:46 AM GMT
2.0: బుల్లిగువ్వా అంటూ పాడుతున్న కీరవాణి
X
రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ అంటేనే అదో హంగామా. దానికి తోడు వందల కోట్ల బడ్జెట్ సైఫై జోనర్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక టీజర్లు.. ట్రైలర్ల పై పెదవి విరిచేవారు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది.

ఈ సినిమాలో ఇప్పటివరకూ రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మూడవ పాట కూడా ఉందని.. బుల్లిగువ్వ అంటూ సాగే ఈ పాటను రెహమాన్ సంగీత దర్శకుడు MM కీరవాణి చేత పాడించాడని తెల్సిందే. ఈ పాట పాడినందుకు కీరవాణికి రెహమాన్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇంతకీ ఈ బుల్లిగువ్వా పాట ఎలా ఉంది? దీపావళి సందర్భంగా ఈ పాటను '2.0' టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను కీరవాణితో పాటుగా AR అమీన్.. సుజానే కలిసి పాడారు.

పక్షులంటే ఇష్టం ఉన్న ఓ సున్నిత మనస్కుడు తన హృదయంలో ఉన్న భావాలను వివరిస్తూ పాడే పాట ఇది. అంటే ఈ సినిమాలో మెయిన్ థీమ్ ను తెలియజేస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ పాత్ర మొబైల్ ఫోన్స్ వాడేవాళ్ళందరూ కిల్లర్స్ అని చెబుతూ వాళ్ళ ఫోన్లు లాగేసుకుంటూ విధ్వంసం సృష్టిస్తాడు కదా. దాని వెనక ఈ పక్షి ప్రేమ కారణమని ఈ పాట మరో సారి కన్ ఫామ్ చేసింది. మొబైల్ ఫోన్స్ వాడకం.. సెల్ ఫోన్ టవర్స్... వాటి రేడియేషన్ వల్ల పక్షి జాతి అంతరించిపోతోందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సినిమా అదే కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోంది కాబట్టి ఈ పాటను మీనింగ్ ఫుల్ గా ఉంది. కీరవాణి వాయిస్ కూడా చక్కగా సూట్ అయింది. మీరూ ఒకసారి కీరవాణి పాడిన బుల్లిగువ్వా పాటను వినండి.